తెలంగాణలో హోంగార్డుల‌కు గౌర‌వ వేత‌నం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. హోంగార్డుల‌కు పెరిగిన వేత‌నాలు 2021, జూన్ నుంచి అమ‌లుల్లోకి రానున్నాయి.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖలు.. సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. వీటికి సంబంధించిన స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  


హోం గార్డుల గౌరవ వేతనం, వారి సంక్షేమంపై సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసు శాఖలో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అర్థం చేసుకున్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో.. హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం హోంగార్డులకు నెలకు 22 వేల రూపాయల గౌరవ వేతనం అందుతోంది. చాలాసార్లు.. తమ గౌరవ వేతనం పెంచాలని.. ప్రభుత్వానికి హోం గార్డులు విన్నవించుకున్నారు. కొన్నేళ్లుగా హోం శాఖలో హోంగార్డులు కీలకంగా వ్యహరిస్తూ విశేష సేవలు చేస్తున్నారు.


Also Read: AP Vs Telangana : విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !


Also Read: YSRCP Attack : మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !


Also Read: jagan CBI Court : అందుకే సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు..మెమో సమర్పించిన సీఎం జగన్ !