Election Laws Amendment Bill: ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధాన బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధానించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Continues below advertisement

ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల కోసం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానించేలా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. 

Continues below advertisement

బిల్లులో ఏముంది?

  • ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం.
  • ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం.
  • ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేయడం.
  • పాన్- ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తారు.

కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్‌ నంబరు కోరేందుకు అధికారులకు ఇది అనుమతిస్తుంది. ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్నవారి నుంచి ఆధార్‌ను సేకరించేందుకూ వీలు కల్పిస్తుంది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటుహక్కు ఉంటే గుర్తించి తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 1951ల్లోని సెక్షన్లకు సవరణలు చేశారు. ఎన్నికల సంస్కరణల పథంలో ఈ బిల్లు కీలకంగా మారనుంది. ఆధార్‌ నంబరు ఇవ్వలేకపోయినంత మాత్రాన ఏ ఒక్కరికీ ఓటుహక్కు నిరాకరించకూడదని తాజా బిల్లులోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలతో వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశమివ్వాలని సూచిస్తున్నాయి.

వ్యక్తిగత గోప్యత..

ఈ బిల్లు చట్టంగా మారితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశముందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు ఏడాదిలో నాలుగు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించేలా మరో ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది.

Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్

Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola