Best 7-Seater Family Cars In 2025: భారత మార్కెట్లో 7-సీటర్ ఫ్యామిలీ కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం, ప్రజలు 7 సీట్ల కార్‌ కోసం క్యూ కడుతున్నారు. 7-సీటర్‌ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Ertiga). దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.97 లక్షలు - రూ. 13.26 లక్షల మధ్య ఉంటుంది. బడ్జెట్, మైలేజ్ & స్పేస్‌ విషయంలో సౌలభ్యం కారణంగా ఈ కార్‌ ప్రజల ఫస్ట్‌ ఆప్షన్‌గా మారింది. 'అందరూ కొంటున్న ఎర్టిగాను నేను ఎందుకు కొనాలి, దానికి భిన్నమైన & మెరుగైన కార్‌ కొంటాను' అని మీరు గట్టిగా అనుకుంటుంటే, ఎర్టిగాకు గట్టి పోటీనిచ్చే మూడు MPVలు ఇప్పుడు మార్కెట్‌లో డెలివెరీకి రెడీ ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)రెనాల్ట్ ట్రైబర్ బడ్జెట్‌లో వచ్చే 7 సీట్ల కుటుంబ కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.15 లక్షల నుంచి రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు పెట్టే ఈ కార్‌ లీటరుకు 19-20 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదు. ఈ కారులో ముందు వైపు రెండు ఎయిర్‌ బ్యాగులు, ABS + EBD, రియర్ పార్కింగ్ సెన్సార్ & కెమెరా, ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్‌ చేసే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్-బటన్ స్టార్ట్ & కీలెస్ ఎంట్రీ వంటి మోడర్న్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీ బడ్జెట్‌ పరిమితంగా ఉండి, మంచి 7-సీటర్‌ కార్‌ కోసం సెర్చ్‌ చేస్తుంటే ట్రైబర్ మీకు సరిపోవచ్చు. ముఖ్యంగా, సిటీ డ్రైవ్‌కు ఇది స్మార్ట్ ఆప్షన్‌ కాగలదు.

కియా కారెన్స్ (Kia Carens)స్టైలిష్‌ లుక్ & ప్రీమియం ఫీచర్లతో ప్యాక్‌ అయిన MPV కియా కారెన్స్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.60 లక్షల నుంచి రూ. 19.67 లక్షల మధ్య ఉంటుంది. ఇది 1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్‌ డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం, కియా కారెన్స్‌ డీజిల్ వేరియంట్ 21 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. కార్‌ క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. మల్టీ-ఇంజిన్‌ ఆప్షన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ & స్టైల్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ కారు సూటవుతుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta)టయోటా ఇన్నోవా క్రిస్టా ఒక లగ్జరియస్‌ & ఫుల్లీ ఫంక్షనల్‌ 7-సీటర్‌ MPV. దీని ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 26.55 లక్షల వరకు ఉంటుంది. ఈ కార్‌ను రాకెట్‌ స్పీడ్‌తో నడిపేందుకు 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌ అందించారు, ఇది లీటరుకు 15-16 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. భద్రత పరంగానూ ఇది బెస్ట్‌ కార్‌, GNCAP నుంచి 5-స్టార్ స్టేఫ్టీ రేటింగ్‌ పొందింది. క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), హిల్ స్టార్ట్ అసిస్ట్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌, రియర్‌ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు దీని పెర్ఫార్మెన్స్‌ను మరింత పెంచుతాయి. సుదూర ప్రయాణాలు, ఎక్కువ సౌకర్యం, గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని ఇష్టపడే కస్టమర్లకు టయోటా ఇన్నోవా క్రిస్టా ఒక మంచి ఎంపిక.

ఏ కార్‌ కొనాలి?మీ బడ్జెట్ పరిమితం అయితే, ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం ప్రకారం, రెనాల్ట్ ట్రైబర్‌ తీసుకోవచ్చు. ప్రీమియం ఫీచర్లు & అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోరుకుంటే, కియా కారెన్స్‌కు అడ్వాన్స్‌ ఇవ్వొచ్చు. బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌, మోర్‌ స్పేస్‌ & లగ్జరీని కోరుకుంటే, టయోటా ఇన్నోవా క్రిస్టాను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ మూడు MPVలలో CNG వేరియంట్లు అందుబాటులో లేవు.