MG Hector Down Payment, Price, Mileage And Features: మన దేశంలో MG మోటార్స్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ, హెక్టర్ మోడల్‌ను ఇటీవలే అప్‌డేట్ చేసి E20 కంప్లైంట్ ఇంజిన్‌తో లాంచ్ చేసింది. MG హెక్టర్ ధర విషయానికి వస్తే, దీని ఎక్స్-షోరూమ్ ధర (MG Hector ex-showroom price) రూ. 13 లక్షల 99 వేల నుంచి ప్రారంభం అవుతుంది. సాధారణంగా, మాస్ మార్కెట్ కార్లలో సింగిల్-పేన్ సన్‌రూఫ్ కామన్‌గా కనిపిస్తుంది. క్లాస్ పీపుల్ ఇష్టపడే ఈ కారులో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది, మాస్ పీపుల్ కంటే ఓ మెట్టు పైన ఉంచుతుంది. ఈ కార్‌లో 360-డిగ్రీస్ కెమెరా, 4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే MG హెక్టర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇంటికి తెచ్చుకోవాలని మీరు ప్లాన్ చేస్తుంటే, కారు పూర్తి ధర చెల్లించాల్సిన అవసరం లేకుండానే మీ పని పూర్తి చేయవచ్చు. అంటే, ఈ SUVని ఫైనాన్స్‌లో తీసుకోవచ్చు. ఈ కారును లోన్‌పై కొనుగోలు చేసే ముందు ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ & EMI గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కొత్త MG హెక్టర్ మోడల్ ధర ఎంత? తెలుగు రాష్ట్రాల్లో, MG హెక్టర్ ఆన్-రోడ్ ధర (MG Hector on-road price) దాదాపు రూ. 17.58 లక్షల నుంచి స్టార్ అవుతుంది, హై-ఎండ్ ఎడిషన్ రేటు రూ. 28.92 లక్షలు ఉంటుంది. మీరు MG హెక్టర్ బేస్ మోడల్‌ను కేవలం రూ. 1.58 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి మిగిలిన రూ. 16 లక్షలు రుణంగా లభిస్తుంది. బ్యాంక్ మీకు 9 శాతం వడ్డీ రేటుతో లోన్ మంజూరు చేసిందనుకుందాం.
లోన్ మొత్తం: రూ. 16 లక్షలు; వడ్డీ రేటు 9 శాతం - EMI వివరాలు
5 సంవత్సరాల (60 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 33,213 EMI చెల్లించాలి. ఐదేళ్లలో, మొత్తం వడ్డీ 3,92,802 + అసలు రూ.16,00,000 కలిపి రూ. 19,92,802 చెల్లించాలి.
6 సంవత్సరాల (72 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 28,841 EMI చెల్లించాలి. ఐదేళ్లలో, మొత్తం వడ్డీ 4,76,542 + అసలు రూ.16,00,000 కలిపి రూ. 20,76,542 చెల్లించాలి.
7 సంవత్సరాల (84 నెలలు) కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 25,743 EMI చెల్లించాలి. ఐదేళ్లలో, మొత్తం వడ్డీ 5,62,372 + అసలు రూ.16,00,000 కలిపి రూ. 21,62,372 చెల్లించాలి.
మీరు నెలకు రూ. రూ.60,000 వేల నుంచి రూ.70,000 వేల జీతం/ఆదాయం సంపాదిస్తుంటే ఈ కారు కొనే ఆలోచన చేయవచ్చు.
MG హెక్టర్ ఫీచర్లు & పవర్MG హెక్టర్ అప్‌డేటెడ్ (facelift) మోడల్ డిజైన్ & ఫీచర్లలో పెద్దగా మార్పులు చేయలేదు. డైమండ్ మెష్ డిజైన్‌తో ఫ్రంట్ గ్రిల్ అందించారు, ఇది ఈ కార్ ప్రీమియం లుక్‌ను మరింత మెరుగుపరిచింది. దీని పవర్‌ట్రెయిన్ కూడా మునుపటిలాగే ఉంది, ఇది రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది - 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & 2.0-లీటర్ ఇంజిన్.