Son stops funeral for mother jewelry: తల్లి చనిపోతే బాధపడాల్సిన ఆ కొడుకు తల్లి ఆభరణాల్లో వాటా రాలేదని గందరగోళం సృష్టించాడు. చివరికి చితిపై కూడా పడుకుని అంత్యక్రియలు నిలిపివేశాడు. ఈ కొడుకు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జైపూర్‌లో 80 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఆభరణాలపై చిన్న కొడుకు వాటా కోరాడు. అంత్యక్రియలు ఆపి, చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. చివరకు ఆభరణాలు ఇవ్వడంతో పెద్ద కొడుకు అంత్యక్రియలు నిర్వహించాడు.
రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని విరాట్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి ఆభరణాలలో వాటా కోసం చిన్న కుమారుడు తన తల్లి అంత్యక్రియలను అడ్డుకున్నాడు. 80 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మరణించగా, ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాల కోసం చిన్న కుమారుడు గొడవ చేశాడు.
పెద్ద కుమారుడు తల్లి అంత్యక్రియల బాధ్యతలను చూసుకుంటుండగా, చిన్న కుమారుడు ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. ఆభరణాలు ఇవ్వకపోతే అంత్యక్రియలు జరపనివ్వనని, లేదా తల్లితో పాటు తనను కూడా చితిలో కాల్చివేయాలంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డియోలో, ఇద్దరు సోదరులు ఈ గాజుల విషయంలో ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం కూడా కనిపిస్తుంది. స్థానిక మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
చివరకు, ఆభరణాలను చిన్న కుమారుడికి ఇవ్వడంతో, పెద్ద కుమారుడు తల్లి అంత్యక్రియలను పూర్తి చేశాడు. పలువురు ఈ కుమారుడిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
నవమాసాలు మోసి.. పెంచిన కొడుకులు చివరికి తల్లి అంత్యక్రియల దగ్గర ఆమె వెండి గాజుల కోసం ఇలా కొట్లాడుకోవడం.. అంత్యక్రియలు ఆపేసి.. ఆమె చితి మీద పడుకుని నిరసన తెలియచేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వీరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కొడుకు ఆ తల్లికి చెడ బుట్టారని మండి పడుతున్నారు.