అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ నేతల వ్యాఖ్యల విషయంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోమవారం స్పందించిన సంగతి తెలిసిందే. అయితే, నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడవారిని ఎవరైతే కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో వాళ్ళ పాపాన వాళ్లే పోతారని.. చంద్రబాబు విషయంలో అది రుజువైందని వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు నాయుడుకు 23 సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. తండ్రి లాంటి ఎన్టీఆర్‌పై కూడా చెప్పులు వేయించి చంద్రబాబు ఏడిపించారని అన్నారు. ఎన్టీఆర్ ఏడుపునకు కారణమైన ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు కనుమరుగు అయ్యారని రోజా అన్నారు.


వైఎస్ జగన్ పాలన మహిళా పక్షపాతిగా సాగుతుందని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో కాల్ మనీ కేసులు, సెక్స్ రాకెట్‌లు, నారాయణ కాలేజీలో చిన్నారుల చావులే చూశామని ఆరోపించారు. ఆ కుటుంబాలను అప్పట్లో ఆదుకోకుండా ఇప్పుడు వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మార్వో వనజాక్షికి అన్యాయం జరిగిన సమయంలోనూ, తనను తన కుటుంబాన్ని అవమానానికి గురి చేసిన సందర్భంలోనూ, ఎంతో మంది ఆడపడుచులు వేధింపులకు గురైన సందర్భంలో భువనేశ్వరి బయట కనిపించలేదని, అలాంటిది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు.


‘‘రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు మామనే కాదు, భార్యను కూడా రోడ్డుపై పెడతారనే ప్రజలకు అర్థమైంది. భువనేశ్వరి గారు మీరు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి చంద్రబాబు వల్లే అపాయం ఉందని అనుకుంటున్నాను. ఆ రోజు అసెంబ్లీలో వాకౌట్ చేసిన రెండు గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దొంగ ఏడుపులు ఏడ్చారు. ఇందులో పెద్ద స్కెచ్ ఉంది. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఎమ్మెల్యే రోజా మాట్లాడారు.


భువనేశ్వరి వ్యాఖ్యలివీ.. 
వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు చెబుతున్న క్షమాపణలు తమకు అవసరం లేదని.. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తిరుపతిలో వరద బాధితులకు సాయం చేసే కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు బాధపడ్డామని .. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారన్నారు.  ఆ బాధ నుంచి బయటకు రావడానికి పది రోజుల సమయం పట్టిందన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని ... అక్కడ ప్రజా సమస్యల గురించే మాట్లాడాలన్నారు. ఇషఅటం వచ్చినట్లుగా మాట్లాడకూడదని..   వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యల గురించి అదే పనిగా బాధపడే సమయం తమకు లేదన్నారు. 


Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !


Also Read: KTR: కేటీఆర్ - కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్.. ఆ రోడ్లు తెరిపించాలని కొనసాగుతున్న నిరసనలు


Also Read: Bride Escape: లేకలేక పెళ్లయింది.. మెట్టింటికి వచ్చిన భార్య, వెంటనే మొత్తం దోచుకుపోయింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి