తల్లిదండ్రులకు, అత్మీయులకు, అభిమాన నాయకులకు, హీరోల జన్మదినం సందర్భంగా వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని వ్యక్త పరుస్తుంటారు. ఇలానే అందరూ ఊహించిన విధంగానే తన అభిమాన నాయకుడికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేయాలని యువ నాయకులు భావించారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో యువ నాయకులు భూమన అభినయ్ రెడ్డి రూబీక్ క్యూబ్స్‌తో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. రూబీక్ క్యూబ్‌లతో జగన్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రూబీక్ క్యూబ్‌తో తయారు చేసిన ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. 


తిరుపతిలోని మేక్ మై బేబీ ట్రైనింగ్ స్కూల్‌లో మూడు నెల పాటు రూబీక్ క్యూబ్స్ అమర్చడంలో భూమన అభినయ్ రెడ్డి శిక్షణ పొందారు. దాదాపు ఆరు వందల రూబీ క్యూబ్‌లను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని అత్యంత సునాయాసంగా అభినయ్ రెడ్డి తీర్చి దిద్దారు. దీనికి సంబంధించిన వీడియోను అభినయ్ రెడ్డి విడుదల చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 






రోజా కీలక నిర్ణయం
సీఎం జగన్ జన్మదినం సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది సీఎం జగన్ జన్మ దినం సందర్భంగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని ఆర్కే రోజా చదివిస్తున్నారు. ఈ ఏడాది జగన్ పుట్టిన రోజు సందర్భంగా నగరి నియోజకవర్గం పరిధిలోని మీరా సాహెబ్ పాళెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ గ్రామానికి కావాల్సిన అన్ని సదుపాయాలను రోజా కల్పించనున్నారు.


ప్రధాని శుభాకాంక్షలు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.






Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం


Also Read: Kunrool Call Money: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం


Also Read: Ysrcp leader Attack: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి