ఏపీలో కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 27,233 పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు చనిపోయారు. కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,481కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం 20,60,061 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,432 యాక్టివ్‌ కేసులున్నాయి.






దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 5,326 కరోనా కేసులు నమోదుకాగా 453 మంది మృతి చెందారు. 8,043 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 79,097కు చేరింది.



  • యాక్టివ్ కేసులు: 79,097

  • మొత్తం రికవరీలు: 3,41,95,060

  • మొత్తం మరణాలు: 4,78,007

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,38,34,78,181


వ్యాక్సినేషన్..


దేశంలో టీకా పంపిణీ వేగంగానే సాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కి చేరింది.



ఒమిక్రాన్ కేసులు..


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, దిల్లీలో అత్యధికంగా చెరో 54 కేసులు ఉన్నాయి. 


Also Read: Election Laws Amendment Bill: ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధాన బిల్లుకు పార్లమెంటు ఆమోదం