అక్రమాస్తుల కేసుల విచారణకు సీబీఐ కోర్టుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ విచారణకు హాజరు కాకపోవడానికి కారణం ఏమిటని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాం... కోర్టు తీర్పు రావాల్సి ఉంది. అందుకే కోర్టుకు హాజరు కావడం లేదని జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాల్సినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ కారణం చెప్పి గైర్హాజర్ అవుతున్నారు. మంగళవారం జరిగిన విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఈ అంశంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి తాజాగా అసహనం వ్యక్తం చేశారు.
Also Read: జగన్‌కు ప్రముఖుల బర్త్‌డే విషెస్.. చంద్రబాబు కూడా !
ప్రతీ విచారణకు మినహాయింపు కోరుతున్నారని ..విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. హాజరు మినహాయింపుపై హైకోర్టులో తీర్పు రావల్సి ఉందని అందుకే రావడం లేదని జగన్ తరపు న్యాయవాది చెప్పారు. ఇదే వివరాలతో మెమో రూపంలో సమర్పించాలని జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశించింది. దాంతో జగన్మోహన్ రెడ్డి అవే వివరాలతో మెమో సమర్పించారు. ఎవరైనా కోర్టులో తీర్పు వచ్చి ... విచారణకు హాజరు కాకుండా మినహాయింపు వస్తే హాజరు కాకుండా ఉంటారు. కానీ కోర్టులో పిటిషన్ వేశామన్న కారణంగా విచారణకు హాజరు కావడం లేదని కోర్టులో మెమో దాఖలు చేశారు.
Also Read: విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !
జగన్‌పై అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో శుక్రవారం మాత్రమే జరిగేది. అయితే ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో .. సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. సీఎం అయినప్పటి నుండి జగన్ ఒకటి ..రెండు సార్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టు హాజరు మినహాయింపు ఇవ్వకపోవడంతో తప్పనిసరిగా హాజరయ్యారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. కరోనా కారణంగా చాలా కాలం సీబీఐ కోర్టులో భౌతిక విచారణలు జరగలేదు.
ఇటీవలే హైకోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్‌పై విచారణ పూర్తయింది., తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే అనేక రకాల పిటిషన్లు వేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నారని.. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తే మరింతగా విచారణ ఆలస్యం అవుతుందని సీబీఐ హైకోర్టులో వాదించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని కోరింది.
Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి