ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును వైఎస్ఆర్‌సీపీ నేతలు  గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సీఎం జగన్‌కు వారి పార్టీల నేతలు శుభాకాంక్షలు చెప్పడం సహజమే.. కానీ ఇతర సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు  చెప్పారు. అందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఉన్నారు. సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ట్వీట్‌లో ఆశీర్వదించారు. 


 






ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలుచెప్పారు. అయితే చంద్రబాబు చెప్పిన విధానం మాత్రం సోషల్ మీడియాలో చర్చకు కారణం అయింది. అటు ఫేస్‌బుక్‌లోనూ.. ఇటు ట్విట్టర్‌లోనూ కేవలం..  హ్యాపీ బర్త్‌డే అని పెట్టి.. ఆయన సోషల్ మీడియా అకౌంట్ పేరును ట్యాగ్ చేశారు. దీంతో జగన్ .. తెలుగుదేశం పార్టీ నేతల్ని వ్యక్తిగత శత్రువులుగా చూస్తున్నందున... చంద్రబాబు కూడా అలాగే చూసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు దీని ద్వారా వస్తున్నాయని కొంత మంది టీడీపీ నేతలు అభిప్రాయాలు పోస్టు చేశారు. గత ఏడాది ఏపీ సీఎం జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ట్వీట్ చేశారు. ఈ సారి మాత్రం ముక్తసరిగా శుభాకాంక్షలు చెప్పారు. 


 






ఇక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. 


 






ఇక టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సమీప బంధువు.. సూపర్ స్టార్ మహేష్ కూడా జగన్‌కు విషెష్ చెప్పారు. 


 






ఇక పుష్పలో విలన్‌గా నటించిన సునీల్ కూడా చెప్పారు. 


 






పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు కూడా జగన్‌కు బర్త్ డే విషెష్ చెప్పారు.