ఆంధ్రప్రదేశ్‌లో 52 లక్షల మంది పేదలకు  రూ. ఐదు నుంచి రూ. పది లక్షల ఆస్తి హక్కు ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప.గో జిల్లా తణుకులో వన్ టైం సెటిల్మెంట్ - సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.  లబ్ధిదారుల స్థిరాస్తి నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడమే కాకుండా ఇప్పుడు మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ చేకస్తున్నామని సీఎం తెలిపారు.  వారికి యాజమాన్య హక్కులతో అందిస్తున్నామన్నారు.  నామమాత్రపు రుసుము కట్టి పది నిముషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేస్తామని.. గతంలో ఉన్న వివాదాలు అన్నీ పరిష్కరించి వివాదరహితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని ప్రకటించారు. 


Also Read: జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ.. వినూత్న రీతిలో చెప్తున్న వైసీపీ లీడర్లు


ఇప్పటి వరకూ 52 లక్,ల మంది  తమ ఇళ్లపై హక్కు లేకుండా ఉన్నారు.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని జగన్ తెలిపారు.  సొంత ఇల్లు ఉంటే అమ్ముకోవచ్చు... రిజిస్ట్రేషన్ చేసిన ఇంటికి.., చేయని ఇంటికి తేడాను గుర్తించాలని ప్రజలను కోరారు. ప్రజలకు  పెద్ద ఎత్తున ఆస్తి లభిస్తుందన్నారు.  తణుకు 19వ వార్డులో సెంట్ మార్కెట్ విలువ రూ. 15లక్షలు ఉందని..  52 లక్షల మంది పేదలకు లక్షా 58వేల కోట్ల ఆస్తి సమకూరుస్తున్నామన్నారు.  రిజిస్ట్రేష్లు లేక ఆస్తి విలువ కోల్పోతున్నారని.. ఈ పరిస్థితి లేకుండా చేయడానికే ఓటీఎస్ తీసుకు వచ్చామనిక జగన్ తెలిపారు.   ఇన్నాళ్లు నివసించే హక్కు మాత్రమే ఇప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుందన్నారు. ఇప్పటికే 8 లక్షల  26వేల మంది ఓటీఎస్‌ను ఎంపిక చేసుకున్నారని.. వీరందరికి రిజిస్ట్రేషన్లు చేయబోతున్నామన్నారు.





 


Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం


మంచి చేస్తూంటే జీర్ణించుకోలని స్తితిలో కొందరు ఉన్నారని సీఎం జగన్ తన ప్రసంగంలో విమర్శించారు. ఓటీఎస్ కట్టవద్దని ఎవరైనా వస్తే... ఓటీఎస్ లేకుండా  మార్కెట్ రేటుకు కొంటారా అని అడగాలని సూచించారు.  వాళ్ల భూములు రిజిస్టర్డ్ భూములైనప్పుడు  ..పేదల భూములు రిజిస్టర్ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.  రుణమాఫీ కాదు.. వడ్డీ కూడా మాఫీ చేయని పెద్ద మనుషులు ఇప్పుడు మాట్లాడుతున్నారని...  మీ  వారసులకైతే ఆస్తులు రిజిస్టర్ చేసి ఇస్తారు..మా ఆస్తులు రిజిస్టర్ చేసుకోకూడదా అని అడగాలని సూచించారు.  


Also Read: Kunrool Call Money: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
  


ఈ 30 నెలల కాలంలో అక్షరాలా బటన్ నొక్కి నేరుగా ఎటువంటి వివక్ష లేకుండా రూ. లాక్షా 16వేల కోట్ల డబ్బును ట్రాన్స్ఫర్ చేశానని సీఎం జగన్  ప్రకటించారు.  అవినీతి రహితంగా నేను ఈ నగదు బదిలీ చేయడం జరిగిందన్నారు. ఓటీఎస్ పథకాన్ని ఉగాది వరకూ పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు.  వీలయినంత ఎక్కువ మందికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరాలని ఆశిస్తున్నాన్నారు. అనంతరం లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధక లబ్ధిదారులకు రిజిస్టర్ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.


Also Read: Ysrcp leader Attack: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి