TMC MP Suspended: రాజ్యసభలో మరో ఎంపీపై వేటు.. 13కు చేరిన సంఖ్య

ABP Desam Updated at: 21 Dec 2021 07:38 PM (IST)
Edited By: Murali Krishna

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది రాజ్యసభ. ఈ సెషన్‌లోని మిగతా సమావేశాలకు ఆయన హాజరు కాకుండా నిషేధించారు.

రాజ్యసభలో మరో ఎంపీపై సస్పెన్షన్ వేటు

NEXT PREV

రాజ్యసభలో మరో ఎంపీపై వేటు పడింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌ను సస్పెండయ్యారు. సభా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయన్ను ప్రస్తుత సెషన్​లోని మిగతా సమావేశాలకు హాజరు కాకుండా నిషేధం విధించినట్లు ఛైర్మన్ ప్రకటించారు. ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లుపై చర్చ సమయంలో డెరెక్.. రాజ్యసభ రూల్​ బుక్​ను ఛైర్మన్​ వైపు విసిరినందుకే సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.



సాగు చట్టాల బిల్లును పాస్ చేసే సమయంలో రాజ్యసభ నుంచి నన్ను ఇంతకుముందు సస్పెండ్ చేశారు. కానీ ఆ తర్వాత సాగు చట్టాలనే రద్దు చేయాల్సి వచ్చింది. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల సంస్కరణ బిల్లు 2021ని దౌర్జన్యంగా పాస్ చేసే సమయంలో గళం విప్పినందుకు మళ్లీ నన్ను సస్పెండ్ చేశారు. ఇది కూడా త్వరలోనే రద్దు అవుతుందని ఆశిస్తున్నాను.                                     - డెరెక్ ఓబ్రియన్, టీఎంసీ ఎంపీ


పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన రోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. గత వర్షాకాల సమావేశాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి సభా మర్యాదలు పాటించని ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేస్తూ రాజ్యసభ సోటీసు ఇచ్చింది.


సస్పెండైన ఎంపీలు..



  1. ఎలమారమ్ కరీమ్ - సీపీఎమ్

  2. ఫులో దేవీ నేతమ్ - కాంగ్రెస్

  3. ఛాయా వర్మ - కాంగ్రెస్

  4. ఆప్ బోరా - కాంగ్రెస్

  5. రాజమణి పటేల్ - కాంగ్రెస్

  6. సయ్యద్ నాసిర్ హుస్సేన్ - కాంగ్రెస్

  7. అఖిలేశ్ ప్రసాద్ సింగ్ - కాంగ్రెస్

  8. బినోయ్ విశ్వం - సీపీఐ

  9. డోలా సేన్ - టీఎమ్‌సీ

  10. శాంతా ఛెత్రీ - టీఎమ్‌

  11. ప్రియాంక ఛతుర్వేదీ - శివసేన

  12. అనిల్ దేశాయ్ - శివసేన




విపక్షాలు నిరసన..

 

12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజూ విపక్ష సభ్యులు నిరసన చేస్తున్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నప్పటికీ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు మరో ఎంపినీ కూడా సస్పెండ్ చేశారు.

 




Published at: 21 Dec 2021 07:34 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.