నిజామాబాద్ జిల్లాలో జరిగిన మూడు మర్డర్‌ల కేసుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయ్. పోలీసులు మాత్రం ఈ కేసులో నిందితున్ని పట్టుకున్నామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. డిసెంబర్ 8న హత్యలు జరిగాయ్. డిసెంబర్ 12న పోలీసులు నిందితున్ని ప్రవేశ పెట్టారు. మూడు రోజుల్లో నిందితున్ని పట్టుకున్నారు సరే... కానీ ఆ ముగ్గురుని చంపిన వ్యక్తి అతనే అన్న ఆధారాల్లో స్పష్టత లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీసీ పుటేజీలో వ్యక్తి అనవాళ్లు క్లియర్‌గా లేని విషయం పోలీసులే చెప్పారు.


పోలీసులు పట్టుకున్న నిందితుడి పూర్వపరాల్లోకి వెళ‌్తే అతడికి 19 ఏళ్లు. గతంలో బాల నేరస్థుడిగా శిక్ష అనుభవించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు గంధం శ్రీకాంత్ స్వస్థలం నవీపేట్. అతను డిచ్‌పల్లికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది. నిందితుడు గంధం శ్రీకాంత్ స్క్రాప్‌ను కలెక్ట్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస అంటున్నారు. అయితే ఒకే సమయంలో ముగ్గురిని ఒకే రీతిలో చంపడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయ్.


డిచ్ పల్లి హార్ వెస్టర్ షెడ్డులో ముగ్గురు నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి వేళ ఒకరిని చంపే క్రమంలో అతనికి తాకిన దెబ్బలకు అరుపులు వినిపించవా.. సదరు వ్యక్తి అరిస్తే మిగతా ఇద్దరు అలెర్ట్ కాలేదా.. పోనీ మొదటి వ్యక్తిని చంపాడు. రెండో వ్యక్తిని అదే టైప్‌లో చంపినపుడు అతను కూడా అరవలేడా.. పోనీ అరవకుండా నిందితుల నోట్లో గుడ్డలు పెట్టాడా అంటే అదీ లేదు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మాత్రం నిద్రలోనే చనిపోయారు అని వచ్చింది. ముగ్గురిలో ఓ వ్యక్తి పెనుగులాడి ఉండొచ్చని రిపోర్డ్ సారాంశం. మరి అతను పెనులాటలో అరవ లేదా.. అది పక్కవాళ్లకు వినిపించలేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. 


ఒకే వ్యక్తి ముగ్గురిని చంపడం అసాధ్యమంటున్న కొందరు.. అతనికి ఎవరైనా సహకరించి ఉండొచ్చని అనుమానపడుతున్నారు. హత్యకు గురైన ముగ్గురు నాన్ లోకల్స్. ఇద్దరు పంజాబ్ కు చెందిన వారు కాగా ఒకరు మెదక్ జిల్లాకు చెందినవాడు. నిందితుడు డబ్బుల కోసం ప్రయత్నిస్తే నిద్ర మత్తులో ఉన్న వారి నుంచి ఈజీగా చోరి చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏ ఖరీదైన ఇంట్లో దూరైనా చోరీ చేయొచ్చు. కానీ హార్ వెస్టర్ మెకానిక్ ల వద్ద చోరి చేసేంత డబ్బు ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయ్.


నిందితుడు స్క్రాప్ అమ్ముకుంటుూ జీవిస్తున్నాడు. అతని వద్ద సెల్ ఫోన్ ఉందే అనుకున్నా... డబ్బుల కోసం చంపే వ్యక్తి ఎవరికి ఫోన్ చేసి ఉంటాడు. కాల్ ట్రాపింగ్ ద్వారా నిందితున్ని పట్టుకున్నామన్న పోలీసులు మరి అతను ఎవరికి ఫోన్ చేసి ఉంటాడు. నిందితుడి ఫోన్ నుంచి వెళ్లిన సదరు వ్యక్తి ఎవరు ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్. నిజంగా ఆ ముగ్గురుని చంపిన వ్యక్తి పోలీసులు చెబుతున్న ప్రకారం నిందితుడు అతనేనా.... అనే దానిపై కచ్చితమైన ఆధారాలు లేవన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


నిజమైన నిందితులు ఎవరైనా ఉన్నారా.... కేవలం సెల్ ఫోన్ల కోసం డబ్బు కోసం ముగ్గురిని హత్య చేసేంత పెద్ద నేరస్తుడు కూడా నిందితుడు కాదు. హత్యకు గురైన వారిలో ఇద్దరు పంజాబ్ కు చెందిన వారు అసలు వారి నేపథ్యం ఏమిటీ అనేది కూడా తెలియదు. ఒకే సయమంలో ముగ్గురుని ఒకే విధంగా చంపడం వెనుకాల నిజా నిజాలేంటో స్పష్టంగా పోలీసుల వివరణపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు మాజీ పోలీసు అధికారులు. 


Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన


Also Read: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌‌పైన కూడా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి