నిజామాబాద్ జిల్లాలో గతంలో మంచి రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్న లీడర్ మండవ వెంకటేశ్వరరావు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. టీడీపీ హాయాంలో మంత్రి పదవులు కూడా చేపట్టారాయన. డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1985లో మండవ వెంకటేశ్వర రావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్నుంచి వరుసగా 5 సార్లు ఓటమి ఎరుగని నేతగా మండవ పేరు తెచ్చుకున్నారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. వివాదరహితుడిగా మండవకు మంచి పేరుంది. కమ్మ సామాజీిక వర్గానికి చెందిన మండవకు జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో మంచి సత్సంబంధాలున్నాయ్. తెలంగాణ రాక ముందు జిల్లా రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు మండవ.
2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత మండవ వెంకటేశ్వరరావు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న మండవ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 2014 తర్వాత డిచ్ పల్లి నుంచి పోటీ కూడా చేయలేదు. డిచ్ పల్లి నియోజకవర్గంలో మండవకు మంచి పేరుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయారు.
2019 ఏప్రిల్‌లో సడెన్‌గా సీఎం కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పారు. కారు ఎక్కించుకున్నారు. ఆ టైంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా కవిత బరిలో ఉన్నారు. మండవ పార్టీలోకి వస్తే కవితకు మరింత మైలేజ్ వస్తుందని భావించారు. మండవ పార్టీలో చేరిన సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కూడా సీఎం కేసీఆర్ కట్టబెడతారన్న ప్రచారమూ జరిగింది. సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి మండవ మంచి సన్నిహితుడు. అయితే 2019లో లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమి చెందారు.
Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
Also Read: నా నవ్వు, బలం, ఆశ నువ్వే... కుమార్తె బర్త్‌డేకు ప్రగతి ఎమోషనల్ పోస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
ఇక నాటి నుంచి మండవ టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడా కనిపించలేదు. మండవకు పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత దక్కలేదని సమాచారం. మండవకు ఎమ్మెల్సీ కచ్చితంగా వస్తుందని ఆయన అనుచరులు భావించారు. కానీ ఇప్పటి వరకు మండవకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావనలోకి రాకపోవటం ఒకింత మండవను కలవర పరిచే అంశంగా భావించారు ఆయన అనుచరులు.
టీఆర్ఎస్ లో క్రీయాశీలకంగా మండవ వ్యవహరిస్తారని అందరూ భావించారు. కానీ పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కకపోవటంతో మండవ పూర్తిగా హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యారు. వివాదరహితుడిగా పేరున్న మండవ ఏ నాడు తనకు ఫలానా పదవి కావాలని కేసీఆర్ ను అడిగిన దాఖలాలు లేవు. ప్రజలతో మంచి సంబంధాలున్న మండవకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదన్న భావన ఆయన వర్గీయుల్లో ఉంది. టీఆర్ఎస్ లో చేరినా మండవ వెంకటేశ్వరరావు పెద్దగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. మండవకు పార్టీలో కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా టీఆర్ఎస్ లో యాక్టివ్ రోల్ పోషించేవారని మండవ ఫాలోవర్స్ అంటున్నారు.
రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న మండవ ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మండవకు కాంగ్రెస్, బీజేపీ ల నుంచి కూడా ఆహ్వానాలు వస్తున్నాయట. కానీ మండవ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.