"నా నవ్వుకు కారణం నువ్వే, నా బలం నువ్వే, నా ఆశకు కారణం నువ్వే... నా అమ్ములూ" అంటూ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ రోజు ఆమె కుమార్తె గీత పుట్టినరోజు. ఈ సందర్భంగా అర్ధరాత్రి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. గీత అంటే ప్రగతికి ఎంత ప్రాణం అనేది ఆమె మాటల్లో వ్యక్తం అవుతోంది.


"అమ్ములూ... హ్యాపీ బర్త్ డే. నువ్వు ప్రతి క్షణం నేను ఎంత గర్వపడేలా చేస్తావో నీకు తెలియదు. నేను నీ తల్లి కావడం దైవ నిర్ణయం కావచ్చు. విధిరాత అయ్యి ఉండొచ్చు. కానీ, నిన్ను నా కుమార్తెగా పొందడం నా అదృష్టం, ఆశీర్వాదం. జీవితాన్ని ఓ వేడుకలా నేను సెలబ్రేట్ చేసుకోవడానికి నువ్వే కారణం. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి" అని ప్రగతి పేర్కొన్నారు. గీత 17వ పుట్టినరోజు ఈ రోజు.






సినిమాల్లో ప్రగతి తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిజ జీవితంలో కుమార్తె అంటే అంత ప్రాణం కాబట్టే... తెరపై కూడా ఆ ప్రేమ కనిపిస్తుందన్నమాట. సోషల్ మీడియాలో తరచూ వర్కవుట్స్, జిమ్ వీడియోస్ ప్రగతి పోస్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ కనిపించే పోస్టులూ చేస్తారు.


Also Read: జనవరి 25 ఎపిసోడ్: ఎందుకు ఇలా చేశారని అంటూ భ‌ర్త కార్తీక్ కాలర్ పట్టుకుని కన్నీళ్లతో ప్రశ్నించిన వంట‌ల‌క్క అలియాస్ దీప... కార్తీక దీపం మంగళవారం ఎపిసోడ్ లో ఏం జ‌రిగిందంటే... పూర్తి వివ‌రాలు
Also Read: 'ఖిలాడి' సినిమాతో బాలీవుడ్‌కు వెళుతున్న మాస్ మహారాజ రవితేజ?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి