దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజు వారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 94.62, లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉంది. వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.107.69గా ఉంది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర. రూ.107.92, డీజిల్ ధర రూ.94.35 గా ఉన్నాయి. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.32 పైసలు పెరిగి.. రూ.108.39గా ఉంది. డీజిల్ ధర రూ.0.30 పైసలు పెరిగి రూ.94.79 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.72 పైసలు పెరిగి రూ.110.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.68 పైసలు పెరిగి రూ.96.72 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. రూ.110.61 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.96.68గా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.40గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.0.35 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.51గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. చిత్తూరులో ఇంధన ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.111.31 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.97.27గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.86.67 ఉంది. కోల్ కతాలో పెట్రలో ధర లీటరుకు రూ.104.67గా ఉంటే ముంబయిలో రూ.109.98గా ఉంది. కోల్ కతాలో డీజిల్ ధర లీటర్ రూ.89.79గా ఉంటే ముంబయిలో రూ.94.14 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42గా ఉంది. డీజిల్ ధర రూ.91.44గా ఉంది.
ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా మరోసారి పెరిగాయి. కానీ దేశంలో పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగా ఉంటోంది. దీంతో ఇవాళ దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి స్థిరంగా ఉంటున్నాయి.
Also Read: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...