2022 జనవరి 25 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ సామర్థ్యానికి మించి పని చేయకండి. మంచివారితో సహవాసం కలిసొస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. రుణం తీసుకోవడానికి ఈరోజు సరైనది కాదు. ప్రైవేటు ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.
వృషభం
కొత్త పనిని ప్రారంభించడంలో ఇబ్బంది ఉండొచ్చు. పొట్టకి సంబంధిత వ్యాధుల గురించి ఫిర్యాదులు ఉంటాయి. మీ బిడ్డకు సంబంధించి మీ బాధ్యతలను నెరవేర్చండి. మీ తప్పులను అంగీకరించడంలో ఆలస్యం చేయవద్దు. పెట్టుబడి సంబంధిత పనులు లాభదాయకంగా ఉండవు.
మిథునం
మాట్లాడేటప్పుడు కొన్ని పరిమితులు పాటించండి. ఒకరి ప్రతికూల పదాలు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అనవసరమైన కార్యకలాపాల్లో మీ సమయం వృధా చేసుకోవద్దు. మీ సహకారాన్ని భావాలను ప్రజలు మెచ్చుకోరు. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు వ్యాయామం, యోగా చేయండి.
కర్కాటకం
ఈరోజు మీరు అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. రోజు సరిగ్గా ప్రారంభం కాదు. ఇద్దరి వివాదం లేదా మాటల మధ్య తలదూర్చొద్దు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్‌లను పొందొచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దినచర్యకు సంబంధించి కొంత సమస్య ఉంటుంది.
Also Read: ఈ ఆలయంపై జెండా నిత్యం మార్చాల్సిందే.. లేదంటే 18ఏళ్ల పాటూ ఆలయం మూతపడుతుందట...
సింహం
ఉద్యోగంలో బదిలీ ఉండొ చ్చు. ఆధ్యాత్మికత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారులతో మీ సాన్నిహిత్యం చాలా బాగుంటుంది. ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందుతారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.
కన్య
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టొచ్చు. దంపతుల్లో ఒకరిపై మరొకరికి విశ్వాసం, గౌరవం పెరుగుతాయి. మీరు ఈరోజు చాలా బిజీగా ఉండబోతున్నారు. మీ పని తీరులో మార్పు ఉంటుంది. సానుకూలత పెరుగుతుంది. వివాదాలు సద్దుమణిగి మనసు సంతోషిస్తుంది. పంటి నొప్పితో బాధపడతారు.
తుల
ఈరోజు మీరు ఏదైనా కొత్త పని తలపెట్టొచ్చు. రిస్క్ ఎక్కువ ఉండే పనులపై ఆసక్తి చూపుతారు. మతపరమైన సంఘటన జరగవచ్చు. ఆర్థిక విషయాలకు ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. మనసులో చెడు భయం ఉంటుంది. స్నేహితుడిని కలుస్తారు. ఒత్తిడి తీసుకోకండి.
వృశ్చికం
ఆరోగ్యం చెడిపోవచ్చు. ప్రయాణాలు వాయిదా పడొచ్చు.సమాజంలో మీ గౌరవం పెరుగుతాయి. ఎక్కువ పనిభారం తీసుకోవడం ప్రయోజనకరం కాదు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
Also Read: కృష్ణుడు లేడు..గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటోంది ఎక్కడంటే...
ధనుస్సు
వ్యాపారాల్లో కస్టమర్ల సౌలభ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రజా జీవితంలో మీ పేరు కీర్తి పెరుగుతుంది. ఆఫీసులో మీ ఆధిపత్యం పెరుగుతుంది. సహోద్యోగులు మిమ్మల్ని అభినందిస్తారు. మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. విహారయాత్రకు వెళ్తారు కొత్త పథకాలు ప్రారంభించవచ్చు. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందుతారు.
మకరం
వైవాహిక సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. బంధువుల నుంచి సమాచారం అందుతుంది.చదవాలనే ఆసక్తి ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరాలి అనుకనే వారికి అనుకూలమైన రోజు.
కుంభం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనవసరమైన సమస్యల కారణంగా, మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. రోజు ప్రారంభంలోనే ముఖ్యమైన పనులు పూర్తి చేయండి. టెన్షన్ తగ్గుతుంది.
మీనం
ఇంటి వాతావరణం టెన్షన్‌తో నిండి ఉంటుంది. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చు. అనారోగ్య సూచనలు ఉంటాయి. మీ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదో ఒక విషయంలో అసంతృప్తిగా ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి