పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు. 1078 సంవత్సరంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తైంది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని  చెబుతారు. ఈ ఆలయంలో అణువణువూ మిస్టరీనే. అవేంటో చూద్దాం...


Also Read: కృష్ణుడు లేడు..గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటోంది ఎక్కడంటే...
అలలు
పూరీ జగన్నాథుడి ఆలయం వెలుపల నుంచి జగన్నాథుడి లీలలు ప్రారంభమైపోతాయి. సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపు వస్తుంది. ముఖ్యంగా పగటిపూట సముద్రం నుంచి భూమివైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు గాలి వీచుతుంది. కానీ పూరీలో మాత్రం మొత్తం రివర్స్.  పైగా హోరున వినిపించే అలల శబ్ధం ఆలయం సింహద్వారం దాటగానే ఆగిపోతుందట. అదే క్షణం ఒక్క అడుగు బయట పెట్టినా అలల హోరు వినిపిస్తుంది. 


పక్షులు ఎగరవు
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి వింత కనిపించదు. ఏ ప్రభుత్వమూ దీన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించలేదు కానీ ఏదో తెలియని అతీతశక్తి కారణంగా ఇది ఆటోమేటిగ్గా నో ఫ్లయింగ్ గా మారిపోయింది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. 


గోపురం నీడ
జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనూ నీడ అనే జాడ ఉండదు. ఇదంతా ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతా లేదా దేవుడి మహిమ వల్ల అలా జరుగుతోందా అన్నది కూడా మిస్టరీగా ఉంటుంది. 


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
జెండా
ఈ ఆలయ గోపురం పై ఉండే జెండాకు ఎంతో ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి దిశనుబట్టి ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి ఎటువైపు వీచినా వ్యతిరేక దిశలో ఊగుతుంది. జెండాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... 45 అంతస్తుల ఎత్తున్న ఈ ఆలయంపైకి నిత్యం  పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.


చక్రం
పూరీ జగన్నాథ్ ఆలయం  గోపురంపై సుదర్శన చక్రం ఉంటుంది. ఎవ్వరైనా పూరీలో ఎక్కడినుంచి చూసిన ఈ చక్రం వారివైపే తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. అదీ ఆ చక్రం ప్రత్యేకత. 


ప్రసాదం
వేల మంది భక్తులు పూరీ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తారు కానీ ఎప్పుడూ వృధాకాదు, భక్తులకు సరిపోకపోవడం అనేది జరగదు.  ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. ప్రసాదం తయారు చేసినప్పుడు ఎలాంటి వాసనా రాదు కానీ స్వామికి నివేదించిన తర్వాత ఘుమఘుమలాడిపోతుందట.


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
రథ యాత్ర
పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.


రథాలు
పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.


బంగారు చీపురు
రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది


Also Read:  ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి