కార్తీకదీపం జనవరి 25 మంగళవారం ఎపిసోడ్


వడ్డీ డబ్బులు కట్టేసి ఆనంద్ ని ఇంటికి తీసుకొచ్చిన దీపను చూసి పిల్లలు సంతోషిస్తారు. పాపం-పుణ్యం అనేవి ఏవీ లేవా డబ్బే ప్రధానమా అని పక్కంటామె మహాలక్ష్మితో అంటుంది. నేను అలసిపోయాను స్నాం చేయించి పంపించు అని చెప్పి లోపలకు వెళ్లిన దీప వచ్చేనెలతో గడువు తీరిపోతుంద్న రుద్రాణి మాటలు గుర్తుచేసుకుంటుంది. ఏ సంబంధం లేని ఆనంద్ దూరమైనందుకే నేను ఇంతలా బాధపడితే... కొడుకు,కోడలు, మనవలు దూరమైతే అత్తయ్య, మావయ్య ఎంత బాధపడుతున్నారో నన్ను క్షమించండి అత్తయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 
మరోవైపు హోటల్ యజమాని దగ్గర్నుంచి ఆరువేలు తీసుకున్న కార్తీక్ ఇవే ఆరులక్షల్లా కనిపిస్తున్నాయనుకుంటాడు. దీప వచ్చివెళ్లిందని రుద్రాణి అన్న మాటలు, ఇంతకుముందే వంటమనిషి అడ్వాన్స్ తీసుకుందన్న హోటల్ యజమాని మాటలు గుర్తుచేసుకుంటాడు. 


Also Read:  మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
రుద్రాణి ఇంటికి కాకుండా నేను ముందు ఇంటికి వెళ్లాలి ఇంట్లో ఆనంద్ ఉన్నట్టైతే హోటల్లో పనిచేస్తున్న వంటమనిషి దీప అన్నది తెలుస్తుంది అనుకుంటూ లోపలకు వెళతాడు. లోపల ఆనంద్ ని చూసి దీప బాబుని డబ్బులిచ్చి తీసుకొచ్చిందా, దీప ఆ హోటల్లోనే పనిచేస్తోందా... నాకు తెలిసినట్టు అడగనా లేదా తెలియనట్టే ఉండనా అనుకుంటూ వెళ్లి బాబుని ఎత్తుకుంటాడు.  కార్తీక్ ని చూసిన దీప ఏం ఆలోచిస్తున్నారు..ఆనంద్ ని తీసుకొచ్చాకదా అంటుంది. ఆనంద్ ని ఎలా తీసుకొచ్చావ్ అంటే.. ఇంట్లో డబ్బులతో పాటూ నేను వంట చేస్తున్న దగ్గర చేబదులు అడిగి తీసుకొచ్చానంటుంది. దీప అబద్ధం చెబుతోందా, నిజంగానే ఎవరి ఇంట్లోనైనా వంట చేస్తోందా అనుకుంటూ... జేబులో ఉన్న డబ్బు తీసి ఇస్తాడు. ఈ డబ్బు ఎక్కడిది అని మళ్లీ దీప అడిగితే..ఆనంద్ ని విడిపించడానికి అడ్వాన్స్ అడిగి తీసుకున్నా అంటాడు కార్తీక్. ఒకే హోటల్లో పనిచేస్తున్నప్పటికీ దీప-కార్తీక్ ఇద్దరూ అబద్ధం చెప్పి మనసులో బాధపడతారు. 


Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
వంటలక్క ప్రజావైద్యశాలలో మోనిత దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న మోనిత... కార్తీక్ తో కలసి బాబుకి శాంతి పూజ చేయించిన సంఘటనలు గుర్తుచేసుకుంటుంది. బాబుని, కార్తీక్ ని వదిలిపెట్టి ఇన్నిరోజులు ఎలా బతికానో అర్థంకావడం లేదంటుంది. స్పందించిన పనిమనిషి విన్నీ ఇలాంటి సమయంలోనే వన్ టు టెన్ లెక్కపెట్టాలని, స్విమ్ చేయాలని అంటారు కదా అంటుంది. పది కాదు కోటి లెక్కపెట్టినా, స్విమ్ కాదు సముద్రాలు ఈదినా నా బాధ తీరదంటుంది. కార్తీక్ సార్ గురించి ఇంట్లో వాళ్లకి తెలుసేమో మేడం అంటుంది విన్నీ. నువ్వు చెప్పినదాంట్లో కూడా పాయింట్ ఉంది ఆలోచిస్తానంటుంది మోనిత.


Also Read: వంటలక్క కాఫీని గుర్తుపట్టిన సౌందర్య, ఆనందరావు, రుద్రాణికి టైమ్ దగ్గరపడిందా .. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
దీపని కష్టపెడుతున్నా...ఎప్పటిలా దీప నవ్వుతూ కనిపించినా, ఆనవ్వు వెనుక దుంఖం నన్ను బాధిస్తోందనుకుంటాడు. ఈ లోగా రుద్రాణి మనుషులు కార్లో వెళుతూ మురికి గుంటలో నీళ్లు కార్తీక్ పై తుళ్లేలా చేద్దాం అనుకుంటారు..అది గమనించిన కార్తీక్ ఓ రాయి పట్టుకుని ఎదురు నిలబడతాడు..ఈ విషయం అర్థం చేసుకున్న రౌడీలు సైలెంట్ సైడైపోతారు. రుద్రాణికి కట్టిన వడ్డీ డబ్బులు ఉండి ఉంటే ఇంట్లోకి సరుకులు నిండుగా తెచ్చుకునేదాన్ని, అన్నీ గమనించి పిల్లలు కూడా ఏమీ అడగడం లేదు, రుద్రాణి అప్పు తీర్చేయాలి, చిట్టీ డబ్బులతో రుద్రాణి అప్పు కట్టేయాలి, అన్ని సమస్యలు తీరాక హైదరాబాద్ వెళ్లిపోయి అందరితో కలసి ఉండాలి అనుకుంటుంది. ఇంతలో పిల్లలు హడావుడిగా లోపలకు వచ్చి నాన్నేరి అని టెన్షన్ గా అడుగుతారు. ఏమైంది అంటే ఇందాక రుద్రాణి మనుషులు వచ్చి మీ నాన్న జాగ్రత్త అని వెళ్లారెందుకు అని అడుగుతారు. ఎపిసోడ్ ముగిసింది..


రేపటి ఎపిసోడ్ లో
కార్తీక్ హోటల్లో పనిచేస్తుండగా చూసిన దీప షాక్ అవుతుంది. ప్లేట్లు తుడుస్తున్న కార్తీక్ ని చూసి కన్నీళ్లు పెట్టుకుని మీరు చేస్తున్నదేంటని నిలదీస్తుంది...


Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి