కార్తీకదీపం జనవరి 24 సోమవారం ఎపిసోడ్
వడ్డీకట్టలేదని బాబుని తీసుకెళ్లిపోతుంది రుద్రాణి..దీప వెళ్లి గట్టిగా నిలదీస్తే డబ్బు కట్టి తీసుకెళ్లు అని చెబుతుంది. ఈ విషయం ఇంకా కార్తీక్ కి తెలియదు. శనివారం ఎపిసోడ్ ఇలా ముగిసింది. మళ్లీ సోమవారం ఎపిసోడ్ లో ఖళీ ఉయ్యాల దగ్గర నిల్చుని బాబు ఆనంద్ ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న దీప... గబగబా వంటింట్లో దాచిన డబ్బులన్నీ తీసి లెక్కపెడుతుంది. ఎలాగైనా వడ్డీ డబ్బులు ఇచ్చేసి ఆనంద్ ని తెచ్చుకుంటాను..ఎంత ఏడుస్తున్నాడో ఏమో అనుకుంటుంది. మూడువేలు చిల్లర ఉన్నాయి ఇంకో మూడు వేలు కావాలి..నాలుగు వేలు కావాలని హోటల్ ఓనర్ ని అడుగుతా అనుకుని బయలుదేరుతుంది దీప. మరోవైపు రుద్రాణి గట్టిగా నవ్వుతూ..తనదగ్గరున్న రౌడీలతో... వడ్డీ డబ్బులు కట్టేందుకే అష్టకష్టాలు పడుతున్నారు ఇంక అసలు ఏం చెల్లిస్తారని అంటుంది. ఈ నెల ఏదో కష్టాలు పడి కట్టినా మరి వచ్చే నెల సంగతేంటంటుంది. ఇక తిరిగి తిరిగి అలసిపోయి చేసేదిలేక రంగరాజుని నాకు ఇచ్చేస్తారంటుంది.
Also Read: వంటలక్క కాఫీని గుర్తుపట్టిన సౌందర్య, ఆనందరావు, రుద్రాణికి టైమ్ దగ్గరపడిందా .. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
కట్ చేస్తే హోటల్ కి వెళ్లిన దీప ఓ నాలుగువేలు కావాలి జీతంలో కట్ చేసుకోండి అని హోటల్ యజమానిని అడుగుతుంది. చేరగానే అడ్వాన్స్ అడుగుతున్నావ్ అంటూనే వంటలు బాగా చేస్తోంది కదా అనుకుంటూ నాలుగు వేలు ఇస్తాడు. ఇద్దరు పెద్దవాళ్లు వచ్చి కాఫీ తాగి వెళ్లారు.. కాఫీ నచ్చడంతో ఎవరు చేశారని కూడా అడిగారు..నేను నీపేరు చెప్పలేదు అంటాడు హోటల్ యజమాని. అత్తయ్య వాళ్లు వచ్చి ఉంటారని అనుకుంటుంది దీప. కట్ చేస్తే కార్తీక్ కూడా అమ్మా-నాన్న ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని ఆలోచిస్తుండగా.. అక్కడకు వచ్చిన పక్కింటామె మహాలక్ష్మి వచ్చి బాబుని రుద్రాణి తీసుకెళ్లిపోయిన విషయం చెబుతుంది. అదివిని కార్తీక్ ఆవేశంగా బయలుదేరుతాడు. మరోవైపు దీప..నా కాఫీ తాగి గుర్తుపట్టేశారా మనిద్దరి మధ్యా అంత ప్రేమ ఉండడం వల్లే దూరం అయ్యాం అనుకుంటూ తొందరగా రుద్రాణి దగ్గరకు వెళ్లి డబ్బులు కట్టేసి బాబుని తెచ్చేసుకోవాలంటూ వెళుతుంది.
Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
ఆవేశంగా రుద్రాణి ఇంటికి వెళ్లిన కార్తీక్.. నువ్వసలు మనిషివేనా అంటే... ఏంటీ సారూ రాగానే తిట్లు మొదలెట్టారు..రావడం రావడం తిడితే ఎలా... అసలు డబ్బులు చెల్లించడం లేదు కనీసం వడ్డీ అయినా చెల్లిస్తారని ఎదురుచూశాను అదీ లేదు...అందుకే రంగరాజుని తీసుకొచ్చాను..వడ్డీ 6,400 చెల్లించి రంగరాజుని విడిపించుకోగలరు అని క్లారిటీ ఇస్తుంది రుద్రాణి. మరోవైపు ఇంటికి వచ్చిన పిల్లలు ఉయ్యాల్లో బాబు లేకపోవడం చూసి..అమ్మ తమ్ముడిని తీసుకుని బయటకు వెళ్లినట్టుంది అనుకుంటారు. ఎప్పటిలా హిమ... మనం ఇక్కడకు ఎందుకువచ్చాం, ఫోన్ ఎందుకు వాడడం లేదు, నాన్న డాక్టర్ అని ఎందుకు చెప్పొద్దన్నారని వరుస క్వశ్చన్స్ వేస్తుంది.
Also Read: డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...
కట్ చేస్తే దీప వడ్డీ డబ్బులు రుద్రాణికి ఇచ్చేసి బాబుని తీసుకెళుతుంది. వడ్డీ ఇవ్వగానే బాకీ తీర్చినట్టు కాదు వచ్చే నెలతో మీకిచ్చిన గడువు తీరిపోతుంది అప్పుడు మీరు పదిరూపాయలు వడ్డీ ఇస్తామన్నా నేను తీసుకోను మొత్తం ఒకేసారి చెల్లించకపోతే రంగరాజుని తీసుకుంటాను, ఆ ఇంటిని జప్తు చేసుకుంటాను... అప్పటికీ నా ఆలోచన బాగోకపోతే మీ ఇద్దరు పిల్లల్లో ఒకర్ని అనేలోగా దీప కోపంగా సమాధానం చెబుతుంది. గడువు గుర్తుపెట్టుకో..రుద్రాణి మంచిది కాదని అందరూ ఎందుకు అనుకుంటారో నీ గడువు తీరాక నీకే తెలుస్తుంది అంటూ...పిల్లలు జాగ్రత్త దీప అంటుంది. మరోవైపు హోటల్ కి వెళ్లిన కార్తీక్ ఆరువేలు అడ్వాన్స్ కావాలి అర్జెంట్ అంటాడు. ఇంతకుముందే వంటమనిషి వచ్చి నాలుగువేలు అడ్వాన్స్ కావాలని తీసుకెళ్లింది..ఇప్పుడు నువ్వు వచ్చావ్.. మీ ఇద్దరూ కూడబలుక్కుని అడుగుతున్నారా అనగానే వంటమనిషా అని ఆలోచనలో పడతాడు. హోటల్ యజమాని నిన్ను చూసి జాలేస్తోందని చెప్పి ఆరు వేలు ఇస్తాడు. ఇక బాబుని తీసుకుని ఇంటికి చేరుకున్న దీపని చూసి హిమ-శౌర్య సంతోషిస్తారు. వెంటనే బాబుని తీసుకుని ఆడుకునేందుకు వెళ్లిపోతారు. ఎపిసోడ్ ముగిసింది...
Also Read: మోనిత బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణిపై దీప ఫైర్.. కార్తీక్ ని సౌందర్య చూస్తుందా… కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్..
రేపటి ఎపిసోడ్ లో
ఒకవేళ హోటల్లో పనిచేసే వంటమనిషి దీపేనా... నేను రుద్రాణి దగ్గరకు కాదు ఇంటికెళ్లాలి అనుకుంటూ కార్తీక్ వెళతాడు. హోటల్లో పనిచేసే వంటమనిషి దీప కాకూడదు, ఇంట్లో ఆనంద్ ఉండకూడదు అంటూ లోపలకు వెళ్లాక బాబుని చూసి షాక్ అవుతాడు. అంటే హోటల్లో పనిచేసే వంటమనిషి దీపేనా అనుకుంటాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి