సీరియల్ అంటే ఏళ్లతరబడి సాగుతుందని ఫిక్సైపోతారు. కానీ కొన్ని సీరియల్స్ మాత్రం అందుకు విరుద్ధం అనే చెప్పాలి. ప్రేక్షకుల సహనానికి పెద్దగా పరీక్ష పెట్టకుండా ఎవ్వరూ ఊహించని విధంగా తక్కువ రోజుల్లోనే క్లోజ్ అయిపోతాయ్. కథను ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెప్పి..పాత్రల నిడివి పెంచకుండా, కొత్త పాత్రలు ఎంటర్ చేయకుండా సూటిగా సుత్తిలేకుండా పూర్తిచేసేస్తారు. కంటే కూతుర్నే కనాలి, ఆమెకథ, మల్లీశ్వరి, కోయిలమ్మ సీరియల్స్ ది కూడా ఇదే దారి. ఈ సీరియల్స్ నడిచినన్ని రోజులూ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాయి... ఎప్పుడైతే సాగదీత అనే ఫీలింగ్ వచ్చిందో వెంటనే శుభంకార్డ్ వేసేశారు. ఇప్పుడీకోవకే చెందుతుంది నిరుపమ్ లీడ్ రోల్ చేసిన 'హిట్లర్ గారి పెళ్లాం' సీరియల్.
2020లో ప్రారంభమైన ఈ సీరియల్ , అందులో నిరుపమ్ పాత్ర తీరుతెన్నులు, కథ అంతా క్లిక్కైంది. అయితే జనాలు చూస్తున్నారు కదా వారి సహనానికి పరీక్ష పెట్టకుండా శనివారంతో ముగించేశారు. ఈ సందర్భంగా హిట్లర్ గారి పెళ్లాం ప్రయాణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు నిరుపమ్. ప్రతీ కథ ఏదో ఒక రోజు ముగిసిపోవాల్సిందే.. 'హిట్లర్ గారి పెళ్లాం'కు ఎండ్ కార్డ్ పడింది. ఈ ప్రయాణమేమీ పూల పాన్పు కాదు.. ఇది మాకు ఎన్నో విషయాలు నేర్పించింది. ఎన్నో జ్ఞాపకాలు ఈ సీరియల్‌తో ముడిపడి ఉన్నాయి. మా ఈ ప్రయాణానికి తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని నిరుపమ్ పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్( డాక్టర్ బాబు) గా మెప్పిస్తున్నాడు. మొన్నటి వరకూ వంటలక్క-డాక్టర్ బాబు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురుచూసిన అభిమానులు ఇప్పుడు వీళ్ల సినిమా కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నారు. మరి నిరుపమ్ పరిటాల కార్తీకదీపం అయ్యేవరకూ మరో సీరియల్ తో వస్తాడో రాడో చూడాలి...
Also Read: వంటలక్క కాఫీని గుర్తుపట్టిన సౌందర్య, ఆనందరావు, రుద్రాణికి టైమ్ దగ్గరపడిందా .. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి