అగ్రవర్ణ మహిళలకు ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన వారిలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తారు. ఈ ఏడాది నిధుల విడుదల సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు అందిస్తారు. రాష్ట్రంలోని రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 3.93 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్‌ నొక్కి వీరి ఖాతాల్లో వేయనున్నారు. 


మహిళల సాధికారతే లక్ష్యంగా


వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకంలో 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఓసీ వర్గాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏటా రూ. 15 వేలు మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని మహిళలకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రవర్ణ పేద మహిళలకు వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ. 15 వేలు అందివ్వడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసు గల పేద మహిళలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. 


Also Read: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు


మహిళల ఆర్థిక సాధికారతతో పాటు సంక్షేమం, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా గర్భవతులు, బాలింతలు, చిన్నారుల కోసం వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించింది. మహిళ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్‌, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం చేపట్టినట్లు వెల్లడించింది. మహిళలకు సాధికారతే లక్ష్యంగా ఇళ్ల పట్టాలు వాళ్ల పేరు మీద ఇస్తున్నట్లు పేర్కొంది. 


Also Read: అసలు నేనెలా పుట్టాను.. ఏదో శబ్దం వచ్చింది.. చూసేసరికి ఇక్కడ పడి ఉన్నాను