కష్టాల్లో ఉన్నవారికి.. ఆయన మాటలు ఎంతో ఊరటనిచ్చేవి. సమస్య ఇది అంటూ చెప్పేవారికి.. తన మాటలతో పరిష్కారం చూపేవాడు. చదువులో వెనకపడిన విద్యార్థులకు తన మాటలతో ఉత్తేజం నింపేవాడు. చాలామందికి బతుకుపై భరోసా కల్పించిన ఆ వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. అర్ధంతరంగా తనువు చాలించాడు. నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.


కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఇంటి నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టు వద్దకు.. ఆదివారం రాత్రి వెళ్లాడు. ఆపై అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బలవన్మరణానికి పాల్పడటం కంటే ముందుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నిజాంసాగర్ ప్రాజెక్ట్.. CH 62 దయచేసి నన్ను క్షమించండి.. ఐయామ్ సారీ అంటూ ఫేస్ బుక్ లో రాసుకొచ్చాడు. కాసేపటికే ఆ పోస్టు చూసిన కొంతమంది.. కామెంట్స్ లో ఏం చేసుకోవద్దంటూ బతిమిలాడారు. ఎలాంటి సాయమైనా చేస్తామని చెప్పారు. కానీ అప్పటికే జైపాల్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి దూకేశాడు. కొంతమంది అక్కడకు వెళ్లి చూసేసరికి.. జైపాల్ రెడ్డికి సంబంధించిన వస్తువులు కనిపించాయి. సోమవారం మధ్యాహ్నం.. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.


ఆరోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు జైపాల్ రెడ్డి రెండురోజల కిందటే ఫేస్ బుక్ లో రాశాడు. కానీ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా జైపాల్ రెడ్డి వేలాది మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సుమారుగా 8 వేల సదస్సుల్లో మాట్లాడారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడూ మోటివేషనల్ అంశాలను రాస్తూ ఉండే వారు. అందరికీ ధైర్యం చెప్పే జైపాల్‌రెడ్డి.. ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగారు.


Also Read: Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి


Also Read: Harish Rao Letter: తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి.. కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ..


Also Read: IAS IPS KCR Letter: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !


Also Read: Hyderabad Crime: వ్యాయామం చేస్తుండగా మందలించిన తల్లి... కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు... అడ్డొచ్చిన చెల్లిపై దాడి


Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...