సివిల్ సర్వీస్ అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఎవరినైనా ఢిల్లీకి పిలిపించుకునేలా క్యాడర్ రూల్స్‌ను కేంద్రం మార్చాలని నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తాము నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానేమంత్రి మోడీకిలేఖ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అసలు ఆలిండియా సర్వీస్ రూల్స్ ఎందుకు మారుస్తున్నారు..? రాష్ట్రాలకు ఇబ్బందేంటి ? 


Also Read: 'భాజపాతో స్నేహం చేసి 25 ఏళ్లు వేస్ట్ చేశాం.. ఇక గల్లీ రాజకీయాలు కాదు దిల్లీయే లక్ష్యం'


కొత్త మార్పులతో కేంద్రం గుప్పిట్లోకి సివిల్ సర్వీస్ అధికారులు !


సివిల్ సర్వీస్ కేడర్‌ రూల్స్‌లో కేంద్రం నాలుగు మార్పులు  ప్రతిపాదించింది. కావాల్సిన అధికారిని స్వయంగా వెనక్కి పిలిపించుకోవడం, ఎంత మందినైనా తీసుకోవడం.. అధికారుల విషయంలో కేంద్రం మాటే ఫైనల్ కావడం .. కేంద్రం అడిగితే మరో మాట లేకుండా అధికారిని పంపాల్సిందే  అన్న నాలుగు సవరణలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర కేడర్‌కు చెందిన సివిల్ సర్వీస్ అధికారినికేంద్రానికి పంపాలంటే రాష్ట్రం నిరభ్యంతరపత్రం ఇవ్వాలి. ఒక రాష్ట్రం నుంచి 40శాతం మందికి మించి కేంద్రానికి డెప్యుటేషన్‌ మీద వెళ్లకూడదనే నిబంధన ఇప్పటి వరకూ ఉంది. ఇక ముందు ఉండదు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే రాష్ట్రాలు ఆమోదం తెలపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. 


ఆరు రాష్ట్రాలు వ్యతిరేకం.. మిగిలిన రాష్ట్రాల నుంచి స్పందన లేదు !


కేడర్‌ రూల్స్‌ మార్పులపై గత ఏడాది కేంద్రం మూడు సార్లు ప్రతిపాదనలు పంపిది. కానీఆరు రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ స్పందించాయి. మిగిలిన రాష్ట్రాలు సమర్థించలేదు.. వ్యతిరేకించలేదు. తాజాగా రిమైండర్ పంపిన కేంద్రం జనవరి 25 వరకు గడువు ఇచ్చింది.ఈసారి కూడా రాష్ట్రాలు స్పందించకపోతే మరోసారి రిమైండర్‌ పంపించి, ఆ తర్వాత ఏకంగా కొత్త నిబంధనలను నోటిఫై చేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ ప్రభుత్వాలున్న చోట వ్యతిరేకించలేరు. బీజేపీకి సానుకూలమైన పార్టీలు కూడా వ్యతిరేకించడం లేదు. 


కేసీఆర్ సహా 9 రాష్ట్రాల వ్యతిరేకత ..  నేరుగా మోడీకి లేఖ !


తెలంగాణ సీఎం  కేడర్ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మోడీకిలేఖ రాశారు. నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇదే విధంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా లేఖ రాశారు. కేరళ , బిహార్‌లో బీజేపీ  భాగస్వామ్య ప్రభుత్వం,  జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల్లో  సివిల్ సర్వీస్ అధికారులను నియంత్రించే ఉద్దేశంతోనే ఇలా చేస్తన్నారని పార్టీలు అనుమానిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.


Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్


రాష్ట్రాల హ్కకులను హరించే ప్రయత్నమని విమర్శలు !
 
 బెంగాల్‌కు వరదలు వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ముఖ్యమంత్రి మమత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ హాజరు కాలేదు. దాంతో ఆగ్రహించిన కేంద్రం ఆయన్ను మే 31న పదవీ విరమణ రోజున డిప్యుటేషన్‌ మీద ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది. ఆయన్ను పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి కారణం అధికారుల్ని కేంద్రానికి పంపాలా లేదా అన్న రాష్ట్రాల ఇష్టం. ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ముందు ముందు మరింత రాజకీయ దుమారానికి కారణం అయ్యే అవకాశం ఉంది. 
  



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి