ఒళ్లు నొప్పులు, జ్వరం చిటికెలో తగ్గించడంలో డోలో 650 సూపర్ మెడిసిన్. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి దీని విలువ మరింత పెరిగింది. ఇళ్లల్లో నిత్యావసర సరుకులతో పాటూ దీన్ని కొనుక్కోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా కనిపించే మాత్రలు ఇవే ఇప్పుడు. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయిన డోలో అత్యంత సాధారణమైన మందు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక మోతాదులో ఎక్కువ మంది తీసుకుంటున్న ఔషధం కూడా ఇదే. దీని పాపులారిటీ ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే ట్విట్టర్, ఇన్ స్టా సోషల్ మీడియాలలో దీనిపై మీమ్స్ కూడా షేర్ అవుతున్నాయి. ఇవి ఫన్నీ మీమ్స్ అయినప్పటికీ ‘డోలో 650’ ఎంత ముఖ్యమో చెబుతున్నాయి.
Also read: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....
Also read: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు