టాలీవుడ్ లో 'కంచె' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికీ.. ఆమె చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. నటించిన సినిమాలు కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో అమ్మడు కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. చాలా కాలం పాటు ఆమె సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించింది.
కొంతకాలానికి బాలయ్య 'అఖండ' సినిమాలో ఛాన్స్ వచ్చింది. అప్పటికే బోయపాటి డైరెక్ట్ చేసిన 'జయ జానకి నాయక' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ప్రగ్యా.. ఈసారి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ కావడంతో వెంటనే ఒప్పేసుకుంది. ఆమె ఆశించినట్లుగానే 'అఖండ' సినిమా సూపర్ హిట్ అయింది. ఇంత పెద్ద హిట్ అందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు ప్రగ్యా.
దానికి కారణమేమిటంటే..? ఆమె కోటికి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. 'అఖండ' లాంటి భారీ హిట్ అందుకున్న తరువాత కూడా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోవద్దనేది ఆమె ప్రశ్న. అందుకే తన దగ్గరకు వస్తోన్న దర్శకనిర్మాతలకు భారీ రెమ్యునరేషన్ చెబుతోంది. రీసెంట్ గా ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆఫర్లు వచ్చినా.. ఆమె ఒప్పుకోకపోవడానికి కారణం కోటి రూపాయల డిమాండే అని తెలుస్తోంది.
ఈ కారణం వలనే ఆమె నుంచి మరో సినిమా ప్రకటన రాలేదని తెలుస్తోంది. మరి ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు దొరుకుతారేమో చూడాలి. లేదంటే మాత్రం ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టమే.
Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?
Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి