విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరలో వెలసిన గిరిజన దేవత పొలమాంబ జాతర తోలేళ్ల ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు ఒడిశా, ఛత్తీస్ గఢ్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం ఆనవాయితీ. జాతరలో భాగంగా తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాలను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆంక్షల మధ్య పూర్తి పోలీస్ బందోబస్తుతో జాతర ప్రారంభమైంది.
ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు
విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరలో సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం జరుగనున్నాయి. జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. దర్శనానికి వచ్చే వారికి రెండు మాస్క్‌లు తప్పనిసరి చేశారు. ప్రతి ఏటా ధనుర్మాసం ప్రారంభం రోజున పెదపోలమాంబ జాతర ప్రకటిస్తారు. వారం రోజులు ఘటాలను శంబరలో ఉంచి పూజలు చేస్తారు. పెదపోలమాంబ అంపకోత్సవం రోజున పోలమాంబను గ్రామంలోకి తీసుకెళ్లడం ఆనవాయితీ.
Also Read: అన్నార్థులకు అండగా స్పందన ట్రస్టు.. రూ.5కే కడుపు నింపుతున్న ‘అనంత’ మిత్ర బృందం
ఇతర రాష్ట్రాల నుంచీ భక్తుల రాక
ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దేవత శంబర పోలమాంబ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రతి ఏటా జనవరి చివరివారంలో జరిగే ఈ గిరిజన వేడుకకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామదేవత పోలమాంబను గ్రామంలోనికి తీసుకువస్తారు. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టిపెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను తమ ఇంటి ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితీ ఉంటుంది కనుక పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తీసుకువస్తారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు సిరిమానోత్సవంలో పాల్గొంటారు.
Also Read: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి