SreeMukhi: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్

ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి క్రేజీ ఫ్యాన్ ఒకరు ఆమె పేరును చేతి మీద పచ్చబొట్టు కింద వేయించుకున్నారు.

Continues below advertisement

హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. ఆర్టిస్టులకూ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన తారల పేర్లను చేతి మీద టాటూలుగా వేయించుకుంటారు. మరి, బుల్లితెర కార్యక్రమాలతో స్టార్స్ అయిన యాంకర్స్ పేరును ఎవరైనా టాటూగా వేయించుకుంటారా? అంటే... ఎందుకు వేయించుకోరు!? 'ఇదిగో చూడండి' అంటూ శ్రీముఖి అభిమాని ఒకరిని చూపించవచ్చు.

Continues below advertisement

శ్రీముఖి జస్ట్ యాంకర్ మాత్రమే కాదు. ఆర్టిస్ట్ కూడా! సినిమాల్లోనూ మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. అయితే... ఆమెకు బుల్లితెర రాములమ్మ అనే ఇమేజ్ వచ్చింది. మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీముఖిని చాలా మంది అభిమానిస్తారు. అందులో తరుణ్ కుమార్ అనే అభిమాని ఒకరు ఆమె పేరును టాటూగా వేయించుకున్నారు. అది శ్రీముఖి దృష్టికి కూడా వచ్చింది. అభిమానం నచ్చినా... 'ఎందుకు?' అని అడిగారు. అభిమానులు అంతే... తారలపై తమ ప్రేమను వివిధ రూపాల్లో చూపిస్తారు. అందులో టాటూలు వేయించుకోవడం ఒకటి.

'బిగ్ బాస్' సీజన్ 3లో రన్నరప్ అయిన శ్రీముఖి... అంతకు ముందు, ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాలకు హోస్ట్, యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది 'క్రేజీ అంకుల్స్', 'మ్యాస్ట్రో' సినిమాల్లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న 'భోళా శంకర్' సినిమాలో ఓ రోల్ చేస్తున్నారు.

Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...
Also Read: మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola