తన అందం.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది నటి మీరా జాస్మిన్. తెరపై ఎంతో పద్దతిగా కనిపిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటించి జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 'గుడుంబా శంకర్', 'భద్ర', 'పందెం కోడి' వంటి సినిమాలు మీరాకు స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ భామ.. 2014 లో అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది.


అయితే పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. అయినప్పటికీ సినిమాలవైపు తిరిగి చూడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఈసారి తన పద్ధతి మొత్తం మార్చేసింది ఈ బ్యూటీ. ఎప్పుడూ లేనంత హాట్ పోజులతో కవ్విస్తోంది. గ్లామర్ షోతో షాకిస్తుంది. 


తను సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోందని.. ఆమె ఫొటోషూట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది మాజీ హీరోయిన్లను మంచి పాత్రలు దక్కుతున్నాయి. తల్లి, వదిన, అక్క క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. కానీ మీరా జాస్మిన్ తీరు చూస్తుంటే అలాంటి రోల్స్ కి ఒప్పుకునేలా లేదు. 39 ఏళ్ల ఈ బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు రావడం కష్టమే. కానీ సీనియర్ హీరోల సినిమాల్లో ట్రై చేస్తే ఛాన్స్ రావొచ్చు. మరి మీరా ప్లాన్ ఏంటో..?






Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్


Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి