ఉదయం 9, 10 గంటలైనా మనలో చాలా మంది దుప్పటి తన్నిపెట్టి పడుకుంటారు. కాస్త చలిగా అనిపించినా ఉదయాన్నే లేవాలనే అనిపించదు. కానీ దేశ సంరక్షణ కోసం రక్తం గడ్డకట్టే చలిలో మన సైనికులు పహారా కాస్తుంటారు. ఎంత ధైర్యం, గుండె తెగువ కావాలి కదా..! అలా చెయ్యడానికి. అయితే చాలా సార్లు సరిహద్దులో మన జవాన్లు చేసే సాహసాలు చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. అదేంటో మీరే చూడండి.


40 సెకన్లలో..






ఎముకలు కొరికే చలి.. పైగా మంచు వర్షంలా కురుస్తోంది. అలాంటి చోట మన దేశ జవాను ఒకరు 40 సెకన్లలో 47 పుష్అప్స్ తీశారు. అవును.. ఈ వీడియోను బీఎస్ఎఫ్‌ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఎంతో అవలీలగా ఆ జవాను ఈ పుషప్‌లను పూర్తి చేశారు. 


సింగిల్ హ్యాండ్..






అలాగే మ‌రో జ‌వాన్ ఒంటి చేతితో పుష్ఆప్స్ చేశారు. ఈ రెండు వీడియోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్టు చేసిన బీఎస్ఎఫ్.. ఫిట్ ఇండియా ఛాలెంజ్ అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఈ రెండు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అవుతున్నాయి.


ఈ వీడియోలను నెటిజన్లు చూసి సెల్యూట్ ఇండియా, జ‌య‌హో ఇండియాన్ ఆర్మీ అంటూ కామెంట్ చేస్తున్నారు. భారత ఆర్మీ పవర్ ఏంటో మరోసారి చూపించారంటూ కామెంట్లు చేస్తున్నారు. చలికి ఎముకలు కొరుకుతున్న చలించక దేశాన్ని కాపు కాసే ఓ సైనికా.. నీకు 'దేశం' సెల్యూట్.


Also Read: CM Uddhav on BJP: 'భాజపాతో స్నేహం చేసి 25 ఏళ్లు వేస్ట్ చేశాం.. ఇక గల్లీ రాజకీయాలు కాదు దిల్లీయే లక్ష్యం'



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి