కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లక్ సఖి'. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌) సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావ్యా వర్మ సహ నిర్మాత. సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు విడుదల చేశారు.


ట్రైలర్ చూస్తే... దేశం గర్వపడేలా షూటర్స్‌ను తయారు చేయాలని సంకల్పించిన ఓ కోచ్‌కు మట్టిలో మాణిక్యం లాంటి అమ్మాయి సఖిని ఓ కుర్రాడు పరిచయం చేస్తాడు. ఊళ్లో ఆ అమ్మాయిని అందరూ 'బ్యాడ్ లక్ సఖి' అంటారు. రైఫిల్ షూటింగ్‌లో ఎటువంటి నేప‌థ్యం లేని ఆ అమ్మాయి కోచ్ దగ్గరకు వెళ్లినప్పుడు లక్ష్యం మీద కాలుస్తుంది. కోచింగ్ తీసుకుని పోటీలకు వెళ్లినప్పుడు ఆమె గుర్తి తప్పుతుంది. ఆ తర్వాత నిరాశలో కూరుకుపోయిన సఖి, దేశం గర్వపడేలా పతకం ఎలా సాధించింది? విజేతగా ఎలా నిలిచింది? అనేది కథగా తెలుస్తోంది.

'మనకి ఏది అలవాటు?' - 'గెలుపు'
'లక్ అనేది?' - 'లేదు'
'మన రాత?' - 'మనమే రాసుకోవాలి'
అంటూ జగపతిబాబు, కీర్తీ సురేష్ మధ్య సాగిన సంభాషణ స్ఫూర్తి నింపేలా ఉంది. ఈ నెల 28న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 







Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్
Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి