తెలంగాణ మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చేశాయి.  అన్ని రకాల బీర్‌ బాటిల్స్‌కు ఎంఆర్‌పీపై రూ. 10 పెంచుతున్నట్టుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది.  రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్‌పీ ఉన్న మద్యం బ్రాండ్లపై.. 180 ఎంఎల్‌పై రూ. 40, 375 ఎంఎల్‌పై రూ. 80, 750 ఎంఎల్‌పై రూ. 160 చొప్పున ధర పెంచారు.  రూ. 200 కంటే తక్కువ ఎంఆర్‌పీ ఉన్న మద్యం బ్రాండ్లపై.. 180 ఎంఎల్‌పై రూ. 20, 375 ఎంఎల్‌పై రూ. 40, 750 ఎంఎల్‌పై రూ. 80 చొప్పున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  వైన్ బ్రాండ్లపై.. బ్రాండ్లపై.. 180 ఎంఎల్‌పై రూ. 10, 375 ఎంఎల్‌పై రూ. 20, 750 ఎంఎల్‌పై రూ. 40 చొప్పున ధర పెంచారు. 




తెలంగాణ సర్కార్ చివరిగా 2020 మే లో మద్యం ధరలను పెంచింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి మద్యం ధరలను మరోసారి పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని.. పాత ఎంఆర్‌పీ ధరలు ఉన్నప్పటికీ కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ధరల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏవైనా సమస్యలు ఉంటే 1800 425 2523 నెంబర్‌కు సంప్రదించాలని సూచించింది. 


హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్


ధరల పెంపు కార‌ణంగా బుధ‌వారం రాత్రి విక్ర‌యాలు ముగి‌సిన తర్వాత రాష్ట్రం‌లోని అన్ని వైన్స్‌, బార్‌, రెస్టా‌రెం‌ట్లను ఆబ్కా‌రీ‌శాఖ అధి‌కా‌రులు సీజ్‌‌చే‌శారు. ఆయా దుకా‌ణాల్లో ఉన్న స్టాక్‌ వివ‌రాలు సేక‌రిం‌చారు. ఇప్ప‌టికే దుకా‌ణ‌దా‌రులు మద్యం డిపోల నుంచి తెచ్చు‌కున్న స్టాక్‌కు కొత్త ధరలు అమ‌లు చే‌య‌డంలో భాగంగా వివ‌రాలు తీసుకున్నారు. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్‌కు అను‌గు‌ణంగా దుకా‌ణ‌దా‌రులు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 


ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త


తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వలేకపోతున్నారు. ఈ కారణంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యం ధరాలను పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.  తాజా పెంపు వల్ల కనీసం పది శాతానికిపైగా లిక్కర్ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 


మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్