రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తానేంటో చూపిస్తానని మీడియా ముందు సవాల్ చేశారు. గాంధీభవన్ మెట్లెక్కనని గతంలోనే సవాల్ చేసిన ఆయన ఇటీవలి కాలంలో అటు వైపు వెళ్లలేదు. అయితే సీఎల్పీ కార్యాలయానికి మాత్రం వస్తున్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు వీహెచ్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదివారం నుంచే తానేమిటో చూపిస్తానని సవాల్ చేశారు.
Also Read : పన్నులు తగ్గించాలని ఆందోళనలు .. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ సెగ !
కాంగ్రెస్ తన ప్రాణమని.. సోనియా గాంధీ తన దేవతన్నారు. కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే వ్యక్తి వీహెచ్ అని, ఆయనలాంటి నేతలంటే తనకెంతో గౌరవమన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని మెరుగుపరచాల్సి ఉందన్నారు. ధార్యం అమ్ముకోలేక చనిపోయిన కామారెడ్డి రైతు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి.. అక్కడ్నుంచే ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటించేశారు. హుజురాబాద్ ఫలితం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా పలువురు సీనియర్ నేతలు రేవంత్ నిర్ణయాలను తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ కమిటీలో కోమటిరెడ్డి సభ్యుడైనప్పటికీ హాజరు కావడం లేదు.
Watch Video : సీనియర్లకు అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి... బైపోల్ ఓటమితో విమర్శల వెల్లువ
ఇప్పుడు నేరుగా రేవంత్ రెడ్డిపైనే విరుచుకుపడ్డారు. తమ నేతలకు ప్రజల్లో క్రేజ్ ఉందనుకున్నానని లేకపోతే తానే ప్రచారానికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. మాణిగం ఠాగూర్‌ను కోమటిరెడ్డి వదిలి పెట్టలేదు. ఆయన లాంటి నేతలుతెలంగాణకు వచ్చి 2023లో అధికారం మాదే అంటుంటే నిజమే అనుకున్నానని కోమటిరెడ్డి సెటైర్ వేశారు. బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 6వేల ఓట్లు వచ్చాయని కానీ.. హుజూరాబాద్‌లో 3వేల ఓట్లే వచ్చాయన్నారు. తాను పెద్ద నాయకుడిని కాదని ఇంట్లో కూర్చున్నానని లేకపోతే ప్రచారానికి పోయేవాడనన్నారు.
Also Read : టీఆర్ఎస్‌కు వరుస కష్టాలు .. "విజయ గర్జన"కు స్థలం సమస్య .. ఎక్కడికెళ్లినా రైతుల ఆందోళన !
ఓ వైపు సోనియా గాంధీని పొగుడుతూ మరో వైపు మాణిగం ఠాగూర్‌ను, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కోమటిరెడ్డి రంగంలోకి దిగడం కాంగ్రెస్ వర్గీయుల్ని ఆశ్చర్య పరుస్తోంది. స్వయంగా తాను ఉద్యమం చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశం అవుతోంది. కోమటిరెడ్డి పార్టీ పరంగా ఏం చేయాలన్నా పొలిటికర్ ఎఫైర్స్ పార్టీ అనుమతి తీసుకోవాలి.. తీసుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన నేరుగా పార్టీపై తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నా అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
Also Read : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ .. కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి