Telangana Congress: సీనియర్లకు అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి... బైపోల్ ఓటమితో విమర్శల వెల్లువ

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు బిజెపిలో బరోసా కల్పిస్తే.. ఇన్నాళ్లు తెలంగాణా రాజకీయ రేసులో నెంబర్ టూగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పరిస్దితి ఏంటి..? హుజూరాబాద్ ఓటమి ఇప్పటికే టిపిసిసిలో సీనియర్లు వర్సెస్ రేవంత్ టీమ్ మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో ఉంది. తెలంగాణా కాంగ్రెస్ ఓ శత్రువును ఓడించేందకు మరో శత్రువుతో దోస్తీ కట్టి తప్పుచేసిందా.. ?  పొలిటిక్ రేసులో రేవంత్  ముందుకు దూకబోయి జారిపడ్డారా.. తెలంగాణా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..? గాలివానలకు నేలవాలే చెట్టుకాదు కాంగ్రెస్. భారీ తుఫాన్ లను సైతం తట్టుకోగలిగే మహా వృక్షం అంటూ తెలంగాణా కాంగ్రెస్ నేతలు పదే పదే మీడియా ముందు చెలరేగిపోతుంటారు.అంత కాన్పిడెంట్ గా మాట్లడే కాంగ్రెస్ నేతలకు హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు గట్టి షాకిచ్చాయి. గెలుపు ,ఓటమి ప్రక్కన పెడితే పోలైన ఓట్లు చూసి తలలు పట్టుకున్నారు. కనీస గుర్తింపు లేనివాళ్లని పోటీలో దించినపుడే హుజూరాబాద్ లో కాంగ్రెస్ 20వేల పైగా ఓట్లు సాధిస్తే ఇప్పడు ౩వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే అసంతృప్తి.. అసహనం..కాంగ్రెస్ అంతర్గత కలహాలను మరో మారు బయటపెట్టింది..
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola