దీక్షా దివస్ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించాలనుకున్న విజయగర్జన సభకు స్థలం సమస్యలు ఎదురవుతున్నాయి. భారీ ఎత్తున పది లక్షల మందితో సభ నిర్వహించి ప్రతిపక్షాల నోళ్లు మూయించాలనుకుంటున్న టీఆర్ఎస్ పెద్దలు ఆ స్థాయిలో సభ సజావుగా సాగేలా అనువైన స్థలం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వరంగల్‌లో నిర్వహించాలని ముందుగానే ఖరారు చేశారు కాబట్టి ఆ చుట్టుపక్కన అనువైన స్థలం కోసం టీఆర్ఎస్ పార్టీ నేతలు వెదుకుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల్లోని రైతులు తమ భూముల్లో సభ పెట్టడానికి లేదని అంటున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు . 


Also Read : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ .. కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారా ?


 కనీసం పది లక్షల మందికి సరిపోయే ప్రాంగణం... రావడానికి పోవడానికి అనుకూలమైన రహదారులు, పార్కింగ్‌ ఇలా మొత్తం అనుకూలంగా ఉన్న స్థలం కోసం టీఆర్ఎస్ నేతలు తిరుగుతూనే ఉన్నారు. వరంగల్ చుట్టుపక్కన పది, పదిహేను కిలోమీటర్ల వరకూ చూస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  పంటలు ఉన్న భూములు.. పంటలు పండుతున్న భూముల్లో సభ నిర్వహిస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదని అంటున్నారు. ఒక్క చోట కాదు ఎక్కడకు వెళ్లినా అదే పరిస్థితి. 


Also Read : సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన.. కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి


చివరికి వర్థన్నపేట నియోజకవర్గం కిందకు వచ్చే దేవన్నపేటలో స్థలం ఖరారు చేసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొట్టి పనులు ప్రారంభించాలని భావించారు. పోలీసుల భద్రతతో ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడ సభ వద్దని నినాదాలు ప్రారంభించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే పనులు ప్రారంభించడానికి కూడా రాలేదు. కానీ పోలీసులు మాత్రం రైతులపై దూకుడుగా వ్యవహరించారు. భూమి పత్రాలు తీసుకురావాలని, ఈ భూమి మీ జాగీరా అంటూ రైతులపై దురుసుగా ప్రవర్తించడంతో వారంతా ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించాల్సి వచ్చింది. 


Also Read : డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాల సీజ్.... పోలీసు శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు


 రైతుల్ని ఒప్పించడానికి ప్రయత్నించకుండా బెదిరించడానికి ప్రయత్నిస్తూండటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. హుజురాబాద్ ఓటమితో నైరాశ్యంలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు విజయగర్జన నిర్వహించుకోవడానికి సరైన స్థలం దొరకకపోవడం నిరాశపరుస్తోంది. గతంలో  టీఆర్ఎస్ సభ అంటే రైతులు స్వచ్చందంగా తమ పొలాలను ఉపయోగిచుకోమని చాన్సిచ్చేవారని ఇప్పుడు వద్దని ఆదోళనలు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి