డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకపోతే పీఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీజ్ చేసిన వాహనాల కోసం మందుబాబులు ఇక నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనితప్పంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దని పేర్కొన్న కోర్టు... మద్యం తాగని మరో వ్యక్తి వెంట ఉంటే వాహనం అప్పగించాలని ఆదేశించింది.
Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?
అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు
ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి వెంట ఎవరూ లేకపోతే బంధువులను పిలిచి వాహనాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఎవరూ రాకపోతే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తర్వాత అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనం అప్పగించాలని తెలిపింది. వాహనం కోసం ఎవరూ రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది.
Also Read: ఢిల్లీకి ఈటల ! హైకమాండ్ ఇక కేసీఆర్‌ను నేరుగా ఢీకొట్టే బాధ్యతలిస్తుందా ?
హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనానికి ఆర్సీ చూపిస్తే వాహనాన్ని తిరిగి ఇవ్వాలని తెలిపింది. అంతే కానీ డైరెక్టర్ గా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదన్న పేర్కొంది. ఈ అంశం పై దాఖలైన 40 పిటిషన్ ల విచారణ ముగిసిన సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read: సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి... జనంపైకి దూసుకెళ్లిన దున్నపోతు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి