హుజురాబాద్ ఉపఎన్నికల్లో లభించిన విజయంతో ఈటల రాజేందర్ ఇమేజ్ తెలంగాణలో ఒక్క సారిగా పెరిగిపోయింది. ఆ ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటల మధ్య జరిగినట్లుగా అందరూ ఓ అభిప్రాయానికి రావడంతో ఆయన కేసీఆర్‌పైనే గెలిచినట్లుగా అందరూ భావిస్తున్నారు. బీజేపీ హైకమాండ్‌కు కూడా ఈటల రాజేందర్ విషయంలో ప్రత్యేకమైన సానూకూల అభిప్రాయం ఏర్పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గెలవక ముందే ఆయనకు జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితునిగా పదవి ప్రకటించారు. ఇప్పుడు మరింత కీలకమైన బాధ్యతలు ఇస్తారని భావిస్తున్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?
ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీలో పవర్‌ఫుల్ లీడర్‌గా మారారు. ఈ క్రమంలోనే బీజేపీకి ఆయన ట్రంప్ కార్డుగా మారిపోయారు. పార్టీలో మరో పవర్ సెంటర్‌గా అవతరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఈటల నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను, ఉద్యమకారులను, టీఆర్ఎస్‌లోని అసంతృప్తివాదులను ఏకం చేసే బాధ్యతలను బీజేపీ హైకమాండ్ ఈటలకు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండాపోయిందని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
Also Read : యువకులకు గాయాలు, 108కు ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అరగంట వెయిటింగ్.. చివరికి..
శనివారం ఈటల ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ తదితరులతో పాటు అపాయింట్‌మెంట్ దొరికితే ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టేందుకు బీజేపీ ఒక కార్యాచరణను రూపొందించే చాన్స్ ఉంది. బహిరంగసభలు పెడతానని ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే ప్రకటించారు.
Also Read: నాగశౌర్య తండ్రి ఫాంహౌస్‌లో పేకాట కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. అసలు సుమన్ ఎవరంటే..
ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన తర్వాత అనేక అనూహ్య పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్, కిషన్‌రెడ్డిల స్థాయిలో ఆయనకూ ప్రాధాన్యం దక్కనుందని అంటున్నారు. అయితే ఇది తెలంగాణ బీజేపీలో కొత్త సమస్యలు సృష్టిస్తుందన్న అభిప్రాయంతో ఉన్న వారు కూడా ఉన్నారు.
Also Read: టీఆర్ఎస్ నేతలకు అప్పుడు మాత్రమే జోష్ వస్తుంది.. సీఎం కేసీఆర్‌కు RRR సినిమా మొదలైందా..!