ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యక్తం చేస్తారు. ముద్దు కూడా అందులో ఒకటి. అయితే, ఒక్కో ముద్దుకు ఒక్కో కారణం ఉంటుంది. పిల్లలకు పెద్దలు పెట్టే ముద్దు నుంచి.. భార్యాభర్తలు, ప్రేమికులు పెట్టుకొనే ముద్దు వరకు.. ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. పెదాలు అవతలి వ్యక్తి శరీరంపై ఎక్కడ ముద్దాడినా అది ప్రేమే. ‘ముద్దు’ అనే డిక్షనరీలో ద్వేషానికి స్థానమే ఉండదు. అయితే, ముద్దును మనం ముద్దుగా ‘ముద్దు’ అని మాత్రమే పిలుస్తాం. లేదా ఇంగ్లీష్‌లో ‘కిస్’ (Kiss) అంటాం. ఇక ప్రేమికులు బిగి కౌగిలితో ఘాటుగా పెట్టుకొనే ముద్దును ‘స్మూచ్’ (Smooch) అని కూడా అంటాం. కానీ, ఏ ముద్దుకు ప్రత్యేకంగా పేరంటూ ఉండదు. కానీ, ‘ఫ్రెంచ్ కిస్’కు ఆ పేరు ఎలా వచ్చిందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రపంచంలో మరెవ్వరూ వారిలా ముద్దుపెట్టుకోలేరా అనే డౌటానుమాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి.. ప్రేమలో మునిగి తేలే ప్రతి జంట పెట్టుకొనే ముద్దే అది. అయితే, దాన్ని ‘ఫ్రెంచ్ కిస్’ అని పిలవడానికి.. ప్రపంచ యుద్ధానికి లింక్ ఉందట. ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటున్నారు కదూ. ఎందుకో చూద్దాం. 


ఫ్రెంచ్ కిస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..: అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అమెరికా, బ్రిటీష్ సైనికులకు ఫ్రాన్స్‌లో మాంచి ఆతిథ్యం లభించింది. అక్కడి ఉన్నప్పుడు ఫ్రాన్స్ మహిళలతో ఏర్పడిన సంబంధాన్ని ఓ తీపి గుర్తుగా మిగిలిపోయేది. కారణం.. అక్కడి మహిళలు పెట్టే ముద్దు. సాధారణంగా అమెరికన్లు, బ్రిటీషర్లు గౌరవ సూచకంగా పెదాలతో ముద్దు పెట్టుకుంటారు. కానీ, ఫ్రాన్స్ మహిళలు అందుకు భిన్నంగా ముద్దు పెట్టేవారట. నోరు పెద్దగా తెరిచి.. నాలుక.. నాలుక కలిసేలా గాఢమైన ముద్దు పెట్టేవారట. పచ్చిగా చెప్పాలంటే అదొక ‘టంగ్ వార్’. ఆ ముద్దు ఎంతో ఉద్వేగభరితంగా ఉండటంతో.. దానికి ‘ఫ్రెంచ్ కిస్’ అని పేరుపెట్టారు. ఫ్రాన్స్ నుంచి తమ దేశాలకు తిరిగి వెళ్లిన సైనికులు ఈ ముద్దును అక్కడివారికి పరిచయం చేశారట. అప్పటి నుంచి ఉద్వేగభరితంగా.. నోటిలో నోరు పెట్టి నాలుకతో సయ్యాటలాడే ముద్దుకు ‘ఫ్రెంచ్ కిస్’ అని పేరు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం సమయానికి ‘ఫ్రెంచ్ కిస్’ ఎల్లలు దాటేసింది. అలా ‘వార్’ కోసం వెళ్లినవారు.. ఫ్రాన్స్‌లో ‘టంగ్ వార్’ ట్రెండ్ తెలుసుకున్నారు.


ఫ్రాన్స్‌లో ‘ఫ్రెంచ్ కిస్’ను ఏమంటారు?:  చిత్రం ఏమిటంటే.. ఫ్రాన్స్‌లో మాత్రం ఆ ముద్దును ‘ఫ్రెంచ్ కిస్’ అని పిలవరు. అక్కడి డిక్షనరీలో కూడా దానికి అర్థం లేదు. సాధారణంగా ఫ్రెంచ్ ప్రజలు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే.. వారి ముద్దు కూడా అంతే ఉద్వేగంగా ఉంటుంది. పారీస్ నగరాన్ని అంతా ‘సిటీ ఆఫ్ లవ్’ అని కూడా పిలవడానికి కారణం కూడా అదే. అక్కడి ప్రజలు తమ పార్టనర్‌లో కామోద్వేగం రగిల్చేందుకు కోసం ఆ విధంగా కిస్ చేస్తారట. రచయిత షెరిల్ కిర్షెన్‌బామ్ 1923లో (ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పేర్కొన్న సంవత్సరం) ‘ది సైన్స్ ఆఫ్ కిస్సింగ్: వాట్ అవర్ లిప్స్ ఆర్ టెల్లింగ్ అజ్’ అనే తన పుస్తకంలో.. ‘ఫ్రెంచ్ కిస్’ అనే పదం ఇంగ్లీష్ భాషలో చేర్చబడిందని పేర్కొన్నారు. ‘ఫ్రెంచ్ ముద్దు’ను ‘ఫ్రోరెంటైన్ ముద్దు’ అని కూడా పిలుస్తారు. 2013 సంవత్సరం వరకు ఫ్రెంచ్‌వారికి ఈ ముద్దుపై అధికారిక పదం లేదు. నాలుకలతో పెట్టుకొనే ముద్దును వారు ‘గాలోచర్’ అని పిలుస్తారని పెటిట్ రాబర్ట్ డిక్షనరీలో పేర్కొన్నారు. అలా.. 2013లో తొలిసారిగా ‘ఫ్రెంచ్ కిస్’కు స్థానం కల్పించారు. 


విద్యావంతులు ఇష్టపడరా?: ‘ఫ్రెంచ్ కిస్’ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. 1948లో ఆల్ఫ్రెడ్ కిన్సే అనే పరిశోధకుడు రూపొందించిన ‘సెక్సువాలిటీ ఇన్ ది హ్యూమన్ మేల్’ అనే నివేదికలో.. ముద్దుల శైలి ఒక వ్యక్తి విద్యా స్థాయితో పరస్పర సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. బాగా చదువుకున్న పురుషులలో 70 శాతం మంది ఫ్రెంచ్ కిస్‌ను అంగీకరించరని పేర్కొన్నారు. హైస్కూల్ చదువు మానేసిన వారిలో 40 శాతం మంది మాత్రమే ఫ్రెంచ్ కిస్‌ను ఇష్టపడతారని తెలిపారు. 


Also Read: బాబోయ్ ‘స్కైలాబ్’.. అందరి కళ్లు ఆకాశం వైపు.. 1979లో కరీంనగర్‌లో ఏం జరిగింది?


ఫ్రెంచ్ కిస్ మంచిదేనా?: ఫ్రెంచ్ కిస్‌ను ‘మోస్ట్ ప్యాషనేట్ కిస్’ అని అంటారు. ఈ కిస్ జీవిక్రియను పెంపొందిస్తోందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్యాలరీలను బర్న్ చేయడానికి ఈ కిస్ బాగా ఉపయోగపడుతుందట. ఆరోగ్యకరమైన ఈ జంట ముద్దులు పెట్టుకోవడం వల్ల నోటిలో లాలాజలం.. బ్యాక్టీరియా, వైరస్‌, శిలీంధ్రాలతో పోరాడుతుందట. గాఢంగా ముద్దు పెట్టుకోవడం వల్ల లాలాజల ప్రవాహం పెరుగుతుంది. ఇది నోరు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ, ఇది నోటిని శుభ్రంగా ఉంచుకొనేవారికి మాత్రమే వర్తిస్తుందనే సంగతి మరిచిపోవద్దు. హెల్త్‌కు సంబంధించిన ఏ విషయమైనా సరే వైద్యుల సూచన తప్పకుండా తీసుకోవాలి. 


Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి