హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో దున్నపోతు బీభత్సం సృష్టించింది. చింతల్ బస్తీ సదర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దున్నపోతును ముస్తాబు చేస్తుండగా తాడు తెంపుకొని పరుగు తీసింది. చింతల్ బస్తీ నుంచి ఖైరతాబాద్ ప్రధాన రోడ్డుపైకి వచ్చిన దున్నపోతు వాహనాలు ధ్వంసం చేసింది. దున్నపోతు దాడిలో పలువురికి గాయాలయ్యాయి. చివరికి దున్నపోతు నిర్వాహకులు ఖైరతాబాద్ కూడలి వద్ద దాన్ని అడ్డుకున్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.


Also Read: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్


సదర్ వేడుకల్లో అపశ్రుతి


సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం పెట్టింది పేరు. భారీ దున్నపోతులను అలంకరించి ప్రదర్శిస్తారు. సదర్ వేడుకలకు సిద్ధమవుతున్న నగరంలో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. నగరంలోని ఖైరతాబాద్‌ సెంటర్‌లో సదర్ వేడుకలలో ప్రదర్శించేందుకు సిద్ధం చేస్తున్న ఓ దున్నపోతు కట్టుతెంచుకుని బీభత్సం సృష్టించింది. దున్నపోతుకు అలంకరణం చేస్తుండగా డీజేల మ్యూజిక్, భారీ శబ్దాల  హారన్‌లకు బెదిరిపోయి జనం పైకి దూసుకెళ్లింది. దున్నపోతుకు ఉన్న తాడు ఓ స్కూటీకి చిక్కుకుని దానిని చాలా దూరం ఈడ్చుకెళ్ళింది. ఆ దున్నపోతు దాడిలో ముగ్గురు వాహనదారులకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమైయ్యాయి. దాదాపు గంటసేపు దున్నపోతు బీభత్సం సృష్టించింది. చివరకు దున్నపోతును అతికష్టంమీద నిర్వాహకులు పట్టుకున్నారు. సదర్‌ ఉత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.


Also Read: ముసలామెను చంపి డబ్బు, నగలు దోచుకెళ్లిన మైనర్లు ! ఈ నేరం నేర్పింది ఆ టీవీ షోనే...


సదర్ ఉత్సవాల ప్రత్యేకత


భాగ్యనగరం సదర్ ఉత్సవాలుకు పెట్టింది పేరు. ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో యాదవ సామాజికవర్గం సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సదర్ ఉత్సవానికి వేలాదిగా ప్రజలు, రాజకీయ నేతలు హాజరవుతుంటారు. దున్నపోతులను బాగా అలంకరించి డీజేల మ్యూజిక్ మధ్య వివిధ రకాలుగా విన్యాసాలు చేయిస్తుంటారు. ఇందుకోసం దున్నపోతులను లక్షల రూపాయల ఖర్చుతో మంచి ఆహారం పెట్టి పోషిస్తుంటారు. ఈ సదర్ వేడుకల కోసం హరియాణా ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి కోట్లాది రూపాయల విలువచేసే దున్నపోతులను తీసుకొస్తుంటారు.


Also Read: షోరూంలో షాకింగ్ ఘటన... డ్రెస్సింగ్ రూంలో దుస్తులు మార్చుకుంటున్న యువతి... వీడియో తీసిన యువకులు


Also Read: 100 మందికి రూ. 8 కోట్లు టోకరా .. అప్పులు చేసి ముంచేసిన గవర్నమెంట్ ఉద్యోగి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి