సీబీఎస్ఈ 12వ తరగతిలో 114 సబ్జెక్టులను, పదో తరగతిలో 75 సబ్జెక్టులను అందిస్తోంది. అన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తే, మొత్తం పరీక్ష వ్యవధి 45-50 రోజులు పడుతుంది. కాబట్టి CBSE అన్ని అనుబంధ పాఠశాలల్లో పరీక్ష తేదీల షీట్‌ను నిర్ణయించింది. దీని ద్వారా ఆయా సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలని సూచించింది.  CBSE పరీక్షల తేదీ షీట్ 2021-2022 విడుదల చేసింది. తేదీలను అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంది. 


Also Read: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు


CBSE 10వ తరగతి పరీక్షలు నవంబర్ 30 నుంచి మొదలుకానున్నాయి. అయితే CBSE 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు డిసెంబర్ 1న ప్రారంభమవుతాయి. ఈ పరీక్ష వ్యవధి 90 నిముషాలు ఉంటుంది. వీటిని ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వహిస్తారు. 






శీతాకాలం కారణంగా బోర్డు పరీక్షలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ ప్రకటించింది. CBSE టర్మ్ 1 పరీక్షల తర్వాత పాస్, కంపార్ట్‌మెంట్, ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీలలో విద్యార్థులను ఉంచమని తెలిపింది. మొదటి, రెండో టర్మ్ CBSE బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తయ్యాకే తుది ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. మొదటి టర్మ్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్కుల షీట్ రూపంలో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. మార్కులు ప్రకటించిన తర్వాత ఫలితాలను cbse.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 


Also Read: విద్యార్థులకు లక్కీ ఛాన్స్.. ఇలా.. ఇన్ స్టా గ్రామ్ రీల్ చేయండి.. ప్రైజ్ గెలవండి 






పరీక్ష నిర్వహణ వ్యవధి


పరీక్ష వ్యవధి 90 నిమిషాల ఉంటుందని ప్రకటించిన సీబీఎస్ఈ... ఎక్కడైనా, కొన్ని మార్పులు ఉంటే అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా ఉంటుందని CBSE తెలిపింది. 


Also Read: ఐఐటీ ఢిల్లీలో న్యూ ఎంటెక్ కోర్సు.. చేస్తే ఉద్యోగావకాశలు ఎక్కువే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి