ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు అధికారానికి దగ్గరి సంబంధం ఉందని రాజకీయనేతలు భావిస్తారు. పాదయాత్ర చేస్తే అధికారం తమ సొంతమవుతుందని నమ్ముతారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకూ పాదయాత్ర బాట పట్టినవాళ్లే. వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టారు. సరిగ్గా ఈరోజున నాలుగేళ్ల కిందట ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 2019లో వైసీపీ అధికారానికి ఓ కారణం అయ్యింది. ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తి అవ్వడంతో సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు అయ్యిందని, నాడు నేడూ తన యాత్ర, ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే అని ట్వీ్ట్ చేశారు. అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 






Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?


ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు


2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో జగన్‌ పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. ప్రజా సంకల్ప యాత్రకు నేటితో(నవంబర్‌ 6) నాలుగేళ్లు పూర్తవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శనివారం వైసీపీ నేతలు పాదయాత్రలు చేపట్టారు.  


Also Read: అలా చేస్తే సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటారు... జైభీమ్ లో చూపించినట్లు నన్నూ హింసించారు.... ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు






రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాదయాత్రలు


ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకున్న కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేశారన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వైసీపీ నేతలు మినీ పాదయాత్రలు చేపట్టారు. 






Also Read: ఆయన ఆఫీసర్ కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్ ..! మార్చాలంటూ కుప్పం ఎన్నికల అధికారిపై హైకోర్టులో టీడీపీ పిటిషన్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి