దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తూంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. పెట్రో ధరల అంశంపై చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం అలాగే పాదయాత్రలో వివిధ సందర్భాల్లో పెట్రోల్ ధరలపై చేసిన ప్రసంగాల క్లిప్పింగ్‌లను చూపించారు. అప్పట్లో జగన్ బాదుడే.. బాదుడు అంటూ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. 


Also Read : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?


దేశంలో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్ని చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ అత్యధిక ధర రాజస్థాన్‌లో ఉంటే తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్‌దేనని చంద్రబాబు పెట్రోల్ రేట్లను వివరించారు. దక్షిణాదిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అత్యధిక రేటు ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు ప్రజలను పన్నుల రూపంలో బాదుతున్న చేతలకు తేడా చాలా ఉందని.. ఇది తుగ్లక్ పాలన కాక మరేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. 


Also Read : జైభీమ్ లో చూపించినట్లు నన్నూ హింసించారు.... ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు


దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ. ఏడు వరకూ తగ్గించాలని కానీ ఏపీలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించే ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజల్ని పన్నుల రూపంలో బాదడం.. అప్పులు తేవడం మినహా ఏపీలో పాలన లేదన్నారు. అరాచకం , విధ్వంసం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఇష్టానుసారంగా పాలన చేస్తున్నారని..ఇదేమీ వైఎస్ జగన్ జాగీరు కాదన్నారు. ట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. ధరలు పెరగడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. ఒక పక్క విధ్వంసం.. మరో పక్క ప్రజలపై భారం.. ఇదే జగన్‌ పాలన అని మండిపడ్డారు. 


Also Read : ఆయన ఆఫీసర్ కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్ ..! మార్చాలంటూ కుప్పం ఎన్నికల అధికారిపై హైకోర్టులో టీడీపీ పిటిషన్ !


మరో వైపు తెలుగుదేశం పార్టీ పెట్రో ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 - 17 రూపాయాలు తగ్గించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి