Breaking News Live: ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు, ఏప్రిల్ 4న ప్రకటన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
AP New Districts Will Be Announced On 4th April, 2022 : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీని కొత్త జిల్లాలపై ఏపీ సర్కార్ ప్రకటన చేయనుంది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటన వెలువడనుంది.
ఏపీలో కరెంటు ఛార్జీలను పెంచనున్నారు. 30 యూనిట్లలోపు కరెంటు వాడితే ఒక్కో యూనిట్‌కు రూ.0.45 పైసల పెంపు వర్తించనుంది. 31 నుంచి 75 యూనిట్ల వరకూ వాడకం ఉంటే ఒక్కో యూనిట్‌కు రూ.0.91 పైసలు పెరగనుంది. 76 నుంచి 125 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.40 పైసలు పెంచారు.
హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ దొరికిపోయారు. మనోజ్ నడుపుతున్న AP 39 HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలానా విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.
* బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి డ్రంకైన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన మందుబాబులు
* పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు
* రోడ్డుపై పడుకొని హంగామా
* పోలీసులు కొన్ని వాహనాలను వదిలేస్తున్నారంటూ ఆందోళన
* తాము మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులతో గొడవ
* సరైన పత్రాలు చూపించకపోవంతో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
* 3 గంటలపాటు రోడ్డు పై హంగామా
సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోనున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు అంశంపై కేసీఆర్ కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. అవసరం అయితే ప్రధానమంత్రి మోదీని సైతం కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనకి ప్రాధాన్యం ఏర్పడింది.
Background
తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇకనుంచి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. మహారాష్ట్ర విదర్భ నుంచి ఉత్తర కేరళ వైపు బలమైన వేడిగాలులు వీచనున్నాయి. అదే సమయంలో దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలకు తీరంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో పొడి గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉక్కపోత, తేమ ప్రభావం అధికం కావడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీళ్లు అధికంగా తీసుకోవాలని సూచించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుందని ఏపీ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు, చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు (పల్నాడు ప్రాంతంలో) ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. ( The Temperature in Telangana)
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్ అర్బన్/రూరల్, యాదాద్రి జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కొమురం భీం జిల్లాల్లో ఎండలు 41 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగనుంది. నమోదుకానున్నాయి. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు నమోదు కావడంతో ఉక్కపోత వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -