Pharmacity in Paravada Anakapalle district | పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయువులు లీకయ్యాయి. ఆ సమయంలో ఫార్మా కంపెనీలో ఉన్న కొందరు కార్మికులు విషవాయువులు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. మొత్తం నలుగురు కార్మికులు అస్వస్థతకు లోనుకాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి కార్మికులను తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలేం జరిగింది..
అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీ తరచుగా ఏదో ఓ ప్రమాదం జరగడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకి ప్రొడక్షన్ బ్లాక్ 1 నుంచి హైడ్రోజన్ సల్ఫేట్ లీకైంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కొందరు కార్మికులు అస్వస్థతకి గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.