Morning Top News:


సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన సీపీ


పుష్ప విషాదం ఘటనపై కమిషనర్ సీవీ ఆనంద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాను కొనేశారని... అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా, మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సీవీ ఆనంద్ పై నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. దాంతో దిగొచ్చిన ఐపీఎస్ సీవీ ఆనంద్ తన మాటలు వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి


అల్లు అర్జున్‌ నివాసంపై ఓయూ విద్యార్థుల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇళ్ల పై దాడి ఘటనను సీఎం ఖండించారు. 'శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని' X లో పోస్టు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సంయమనం పాటిస్తాం: అల్లు అరవింద్


తన ఇంటిపై ఓయూ విద్యార్థుల జేఏసీ చేసిన దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అందరూ సంయమనం పాటించాలని.. అదే అందరికీ మంచిదని, తమ ఇంటి బయట జరిగిందంతా ప్రజలు చూశారని అల్లు అరవింద్ అన్నారు. ఇంటి ముందు ఆందోళన చేసిన వారిని పోలీసులు వచ్చి తీసుకెళ్లి కేసు పెట్టారని తెలిపారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


చంద్రబాబు మనవడా.. మజాకా


సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వేగంగా పావులు కదపడంలో దేవాన్ష్ అరుదైన రికార్డు సృష్టించాడు. 'వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్' వరల్డ్ రికార్డు కైవసం చేసుకొని.. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని


19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్‌లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు  సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్‌లోనే తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా హాస్టల్ సిబ్బంది, అధికారులు ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి జయప్రదను సస్పెండ్ చేశారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


గోదావరి జిల్లాల్లో ఏరులై పారుతున్న మద్యం


కొత్త మద్యం పాలసీను చాలా పారదర్శకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో గ్రామాల్లో వీధి వీధికో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి పెద్దమొత్తంలో మద్యం తెచ్చి విడిగా విక్రయాలు యధేచ్ఛగా సాగిస్తున్నారు. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో అనధికారికంగా తెరిచిన మద్యం బెల్ట్‌ షాపులు పట్టపగలే యధేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఆధారాలతో బన్నీని కార్నర్ చేసిన పోలీసులు


ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పుష్ప విషాదానికి సంబంధించి పలు వీడియోలు విడుదల చేశారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలను చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపు తప్పిందని అల్లు అర్జున్‌కు చెప్పినా సినిమా చూశాకే వెళ్తానని బన్నీ చెప్పినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఫస్ట్ నైట్ రోజు బీరు, గంజాయి అడిగిన భార్య


యూపీలోని సహ్రాన్​పూర్​లో విచిత్ర ఘటన జరిగింది. ఫస్ట్​నైట్​ గదిలో ఎదురు చూస్తోన్న భర్తకి.. ఓ భార్య షాక్ ఇచ్చింది. అతనిని తనకో కోరిక ఉంది.. దానిని తీర్చాలంటూ అడిగింది. ఆమె అడిగిన వింత కోరికలు చూసి భర్త షాకయ్యాడు. తనకు బీర్​ కావాలని, గంజాయి కావాలని, మేక మాంసం తేవాలని కోరగా.. భర్త షాకైపోయాడు. దీంతో భర్త బీర్ తెచ్చాడు. కానీ భార్య మాత్రం గంజాయి, మేక మాంసం కావాలంటూ పట్టుబట్టింది. దీంతో గొడవ పోలీస్​ స్టేషన్​కి వెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


చరిత్ర సృష్టించిన జొమాటో


ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ & శీఘ్ర వాణిజ్య సంస్థ జొమాటో  23 డిసెంబర్ 2024, సోమవారం చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి, ఆ కంపెనీ ఇన్వెస్టర్లు & షేర్‌ హోల్డర్లు, సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌కు ఇది చాలా ప్రత్యేకమైన & జీవితంలో మరిచిపోలేని రోజు.జొమాటో షేర్లు ఈ రోజు నుంచి BSE సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లోకి అడుగు పెట్టాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


వైభవంగా పీవీ సింధు పెళ్లి


భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ దత్తా సాయి.. ఆదివారం రాత్రి 11.20 నిమిషాలకు సింధు మెడలో తాళి కట్టారు. వెంకట్ దత్తా సాయితో కలిసి సింధు ఏడడుగులు వేశారు. సింధు పెళ్లికి దాదాపు 140 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. బుధవారం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..