AP Medical Jobs: ఏపీలోని పలు జిల్లాల డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో 14 ఖాళీలు, చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో 16 ఖాళీలు, విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో 7 ఖాళీలు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు సంబంధిత జిల్లా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, సంబంధిత జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* వైఎస్సార్ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో..
ఖాళీల సంఖ్య: 14.
1. ఫిజీషియన్/ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 02 పోస్టులు
3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 05 పోస్టులు
4. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 04 పోస్టులు
5. ఫార్మసిస్ట్: 01 పోస్టు
6. టీబీ హెల్త్ విజిటర్: 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఎంపీడబ్ల్యూ/ ఎల్‌హెచ్‌వీ/ ఏఎన్‌ఎం, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: 30.12.2024.
ఫిజీషియన్ పోస్టులకు ఇంటర్వ్యూ తేదీ: 30.12.2024.
* చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో
ఖాళీల సంఖ్య: 16
1) ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు
2) ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 07 పోస్టులు
3) శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 06 పోస్టులు
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ).
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు ల్యాబ్-టెక్నీషియన్ పోస్టులకు రూ.32,670. ఇతర పోస్టులకు రూ.15,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 27.12.2024.
* విజయనగరం జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలో..
ఖాళీల సంఖ్య: 07
1. మెడికల్ ఆఫీసర్- డెంటల్: 01 పోస్టు
2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు
3. అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
4. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు
5. ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు
6. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ టెక్నీషియన్ కోర్సు, పీజీ, ఎంఫిల్, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరితేదీ: 31.12.2024.
ALSO READ:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, ఈ అర్హతలు అవసరం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' నియామకాలకు నోటిషికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.550 చెల్లించాలి. రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులకు మార్చి 22 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..