Karimnagar Cat Rescue :

  
సమయం అర్థరాత్రి !
అది పోలీస్ కమిషనర్ ఇల్లు.!  అప్పుడే ఆయన నిద్రకు ఉపక్రమించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ పెద్దగా ఫోన్ చేయరు. ఫోన్  చేశారంటే అది అత్యవసరమే అవుతుంది. అప్పుడే ఆయన ఫోన్ రింగయింది. అది డీఎస్పీల నుంచి వచ్చింది కాదు.. పోలీసుల నుంచి వచ్చింది కాదు. ఎవరో సామాన్యుడి నుంచి వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన సీపీ వెంటనే... తన కింద అధికారులను అలర్ట్ చేశారు. అతని సమస్యను పరిష్కరించాలని ఓ నిండు ప్రాణాన్ని కాపాడాలని ఆదేశించారు. 


ఈ సారి పర్యావరణ హిత ఖైరతాబాద్ గణేశ్ - 50 అడుగులకే పరిమితం !


నేరుగా సీపీ చెప్పిన తర్వాత పాటించకుండా ఉంటారా ? పోలీసులు ఆఘమేఘాల మీద స్పందించారు. వెంటనే ప్రాణం కాపాడారు. అయితే వారు కాపాడింది మనిషి ప్రాణాన్ని కాదు.. ఓ పిల్లి ప్రాణాన్ని.. నిజంగా పిల్లినే.. క్యాట్‌నే. 


48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?


కరీంనగర్ సీపీ సత్యనారాయణకు అర్థరాత్రి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన బావిలో తన పిల్లి పడిపోయిందని కాపాడాలని కోరారు. ఎవరో తాగుబోతు తనతో పరాచికాలాడుతున్నారేమోనని కాస్త డౌట్ వచ్చినా.. ఆ సీపీ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. టౌన్ ఏ సి పి తుల శ్రీనివాస రావు కి ఫోన్ చేసి,  కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి,  ఆ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించారు.  వాట్సాప్ లో వారి లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసిపి కి షేర్ చేయడంతో.....టౌన్ ఏ సి పి, ఆ  ఏరియా లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజి రెడ్డి   సిబ్బందిని రెస్క్యూ టీం గా ఏర్పాటు చేశారు.   


సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లికి బేడీలు వేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి - డీకే అరుణ


బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి,  ఆ బుట్టలో పిల్లి కూర్చునే  విధంగా  ప్రయత్నించి...... పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించారు.  45 నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశారు. పోలీసుల తీరుపై అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే పిల్లులనే కాదు.. మనుషులకు ముప్పు వచ్చినప్పుడు కూడా ఇంతే వేగంగా స్పందించాలని కొంత మంది సెటైర్లు వేశారు. అయితే తమ విధి నిర్వహణలో మార్పు ఉండదని.. అందర్నీ కాపాడతామని పోలీసులు భరోసా ఇచ్చారు.