DK Aruna On BJP Meeting : సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లికి బేడీలు వేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి - డీకే అరుణ

ABP Desam   |  Satyaprasad Bandaru   |  27 Jun 2022 03:36 PM (IST)

DK Aruna On BJP Meeting : జులై 3న సికింద్రాబాద్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని విమర్శించారు.

మాజీ మంత్రి డీకే అరుణ

DK Aruna On BJP Meeting : తెలంగాణ చరిత్రలోనే నిలిచిపోయే సభగా ప్రధాని మోదీ బహిరంగసభ నిలిచిపోతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ విధానాన్ని మోదీ ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని డీకే అరుణ విమర్శించారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నియంత మాదిరి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మిగిలిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల‌ హామీలు అమలులో‌ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.  బంగారు కుటుంబంగా మారింది  

'ప్రధాని మోదీ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పాల్గొంటారు. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ జరగనటువంటి సభను నిర్వహిస్తున్నాం. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన ఉద్దేశాన్ని మార్చి నియంతృత్వ పోకడలకు పోతున్నారు. బంగారు తెలంగాణ ఇవాళ లేదు. బంగారు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఉంది. నీళ్లు, నిధులు , నియామకాలపై ఏర్పాటైన తెలంగాణలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. డబుల్ బెడ్ రూమ్  ఇళ్లు, నిరుద్యోగి భృతి, దళితులకు మూడెకరాల భూమి ఇలా ఎన్ని హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ప్రధాని మోదీ దేశంలో అట్టడుగు వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తుంది. ప్రపంచంలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు.' - డీకే అరుణ, మాజీ మంత్రి 

తెలంగాణ తల్లికి బేడీలు 

తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారు. ఆమెకు స్వేచ్ఛ రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే. మనం కలలు కన్న తెలంగాణ రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. గ్రామ గ్రామాల్లో బీజేపీ పర్యటిస్తుంది. ప్రధాని మోదీ తెచ్చిన పథకాలను ప్రచారం చేస్తుంది. జులై 2,3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జులై 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. అది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. - -డీకే అరుణ, మాజీ మంత్రి 

 

Published at: 27 Jun 2022 03:36 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.