పర్వతారోహణ సులువైన విషయమేం కాదు.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ శిఖరపు అంచును చేరడం విపరీతమైన సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. మోకాళ్లలోతు మంచులో, ప్రాణవాయువు తక్కువగా ఉన్న స్థితిలో, ఎత్తు పల్లాలను లెక్క చేయకుండా పైకి సాగిపోతుండాలి. మంచు తుపాన్లను, గాలులను లెక్క చేయకుండా ఉండాలి. అయితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఇలాంటి సవాళ్లను అధిగమించి తెలంగాణకు చెందిన ఓ బాలిక పర్వతారోహణ చేసింది. అది కూడా ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తైన కిలిమాంజారో పర్వతాన్ని.


ఆఫ్రికా ఖండంలో ఉండే కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తు ఉంటుంది. సంక్లిష్టమైన ఈ శిఖరాన్ని హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక పులకిత హస్వి విజయవంతంగా ఎక్కింది. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఇష్టంగా ఎదుర్కోవచ్చనే మాటలను ఆమె నిజం అని మరోసారి నిరూపించింది. అయితే, తన పర్వతారోహణకు సంబంధించి తాను తీసుకున్న ట్రైనింగ్, పర్వతం ఎక్కేటప్పుడు ఎదురైన అనుభవాల గురించి పులకిత హస్వి ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడింది.






ఏప్రిల్‌ నుంచి సన్నద్ధం..
‘సినిమాలు చూడడం ద్వారా పర్వతారోహణకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నా. కిలిమంజారో పర్వత అధిరోహణ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సన్నద్ధమయ్యాను. ముందుగా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపులో 3 నెలలు శిక్షణ పొందాను. అక్కడ మౌంటెయినీరింగ్‌కు సంబంధించి శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం పొందాను. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ ఎంతో ఉపయోగపడింది. ఇక్కడితో నా ప్రయాణం ఆగిపోలేదు. 2024కు ముందే ప్రపంచంలోని ఏడు శిఖరాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.’’ అని హస్విత చెప్పింది.






Also Read: మాపై దాడులకు సూత్రధారి సీఎం కేసీఆరే.. బండి సంజయ్, ఉద్రిక్తతల మధ్యే రెండోరోజూ పర్యటన


Also Read: Kurnool: ఇంట్లో ఒంటరిగా డిప్యూటీ తహసీల్దార్.. సాయంత్రం భార్య వచ్చి చూసి షాక్, కన్నీరుమున్నీరు


Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి