అందమైన అమ్మాయి కదా అని టెంప్ట్ అయ్యి నగ్న వీడియో చాట్‌లు చేశాడు. అవతలి వ్యక్తి కిలాడీ అని గుర్తించలేకపోయాడు. చివరికి అసలు నిజం తెలిసి ఓ యువకుడు గుండెలు బాదుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలో తెలియక బాధితుడు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అందమైన అమ్మాయిల ఫోటోలను ఎరగా వేసి, న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకొని వాటితో డబ్బు ఇవ్వాలని ఓ కేటుగాడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. స్ర్కీన్ రికార్డ్ చేసిన న్యూడ్ వీడియోలను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్‌ క్రైం పోలీసుల్ని సోమవారం ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే..


Also Read: Honda New SUV: హోండా కొత్త ఎస్‌యూవీలు త్వరలో.. ఈ విభాగంలో బెస్ట్?


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఓ కేటుగాడు హైదరాబాద్‌కు చెందిన యువకుడికి ఓ వ్యక్తి వాట్సప్‌లో పరిచయమయ్యాడు. ఫోన్‌లో ఉండే ప్రత్యేక యాప్‌ల సాయంతో పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడాడు. బట్టలు లేకుండా న్యూడ్‌ ఉన్న మహిళ ఫొటోలను పంపి యువకుడికి గాలం వేశాడు. ఇలా రెండు, మూడు సార్లు వాట్సప్‌ వీడియో కాల్‌ చేయించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే యువకుడిని దుస్తులు విప్పాలని కోరాడు. ఆపై యువకుడు వీడియో కాల్‌లో బట్టలు లేకుండా ఉన్న వీడియో మొత్తాన్ని రికార్డ్‌ చేశారు. ఆ తర్వాత తన నిజ స్వరూపం మొత్తాన్ని దుండగుడు బయట పెట్టాడు. తదనంతరం డబ్బులు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ న్యూడ్‌ వీడియోను వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయడంతో పాటు.. యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తామని చెప్పి బెదిరించాడు.


దీంతో వారు చెప్పిన విధంగా యువకుడు చాలా సార్లు ఇప్పటి వరకు ఏకంగా రూ.4 లక్షలు పంపాడు. ఎంత పంపినా తీసుకుంటున్నారే కానీ, వీడియో డిలీట్‌ చేయడం లేదని, మరికొన్ని డబ్బులు కావాలని వేధిస్తున్నాడు. దీంతో ఏమీ పాలుపోని బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.


Also Read: Kurnool: ఇంట్లో ఒంటరిగా డిప్యూటీ తహసీల్దార్.. సాయంత్రం భార్య వచ్చి చూసి షాక్, కన్నీరుమున్నీరు


Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు


Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి